GST ON AUTO RICKSHAW RIDE : సామాన్యులకు కేంద్రం మరో షాకిచ్చింది. ఇప్పటికే ధరల పెరుగుతదలతో సతమతమవుతున్న సామాన్యుడిపై జీఎస్టీ పేరుతో మరో వడ్డన వేసింది.
ఆటో ప్రయాణాన్ని ప్రజలకు భారంగా మార్చింది. ఆటో ప్రయాణంపై(RICKSHAW RIDE ) జీఎస్టీ వసూలుకు నిర్ణయించింది. అంటే.. ఆటో ఎక్కినా ఇకపై చార్జీకి అదనంగా జీఎస్టీ చెల్లించాల్సిందే. ఆటో రిక్షా బుకింగ్ పై 5 శాతం జీఎస్టీ వసూలుకు నిర్ణయించింది.
ఓలా, ఉబర్ వంటి సంస్థల యాప్ లలో ఆటో బుక్ చేసుకుంటే జీఎస్టీ(GST) వర్తిస్తుంది. సాధారణంగా నడిచే షేర్ ఆటోలు, ఇతర ఆటోలపై జీఎస్టీ బాదుడు లేకపోవడం కాస్త ఊరట కలిగించే విషయం.
కొత్త నిబంధన వచ్చే ఏడాది అంటే 2022 జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం ఈ నెల 18నే ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఇప్పటి వరకు ఈ కామర్స్ ఆటో(AUTO) రిక్షా బుకింగ్ పై జీఎస్టీ మినహాయింపు ఉండేది. దాన్ని ఇప్పుడు ఉపసంహరించుకున్నారు.
ప్రస్తుతం చాలా మంది ఆటో బుక్ చేసుకునేందుకు ఓలా(OLA), ఉబల్ (UBER)వంటి యాప్ లనే వాడుతున్నారు. ఫొన్ లో బుక్ చేసుకుంటే ఇంటికే ఆటో రిక్షా రావడం.. ఆఫర్లతో ధర తక్కువగా పడుతుండటంతో ప్రజలు చాలా వరకు యాప్ లనే వాడుతున్నారు. కానీ ఇకపై రేట్లు వాచిపోయే ప్రమాదం ఉంది. రాబోయే రోజుల్లో దీన్ని మరింత పెంచే అవకాశం కూడా ఉందనే మాట వినిపిస్తోంది.
READ ALSO :
- Lays : ఐదు రూపాయలు పెట్టి చిప్స్ ప్యాకెట్ కొంటె ఆరు చిప్సే వచ్చినయ్..!
- Sivasankar : శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమం…. 75% ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్..!
- Biryani Free : అక్కడ బిర్యానీ ఫ్రీ… కానీ దూలతీరిపోయే కండిషన్..!
- Zoo Park : జూపార్క్‌లో యువకుడు హల్చల్… సింహం దగ్గరికి వెళ్లి..!
- Arvind Kejriwal : కేజ్రీవాల్ సార్… మీరు మారిపోయరండి.. మీరు మారిపోయారు..!
- Priyanka Chopra : విడాకులకి సూటి వెట్టిన ప్రియాంక .. హింట్ ఇచ్చేసింది..!
- Chandrababu Naidu : చంద్రబాబుకి అవమానం జరిగిందని మహిళా ఉద్యోగి రాజీనామా
- Vijayashanthi : ప్రజల్ని మోసం చేసుట్ల కేసీఆర్ పిహెచ్డీ చేసిండు..!
- KCR Delhi: ఢిల్లీకి సీఎం కేసీఆర్ భార్య.. ఊపిరితిత్తులు సమస్యతో బాధపడుతూ..!
- Karthikeya Marriage : ఘనంగా హీరో కార్తికేయ పెళ్లి… స్పెషల్ అట్రాక్షన్‌గా ఇందు..!