Baga beach : ఏందిరయ్యా ఇది..? పోయే కాలం.. ఏం చేస్తం..?
Latest National

Baga beach : ఏందిరయ్యా ఇది..? పోయే కాలం.. ఏం చేస్తం..?

Goa baga beach : న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా చేసుకోవాలనిప్రతీ ఒక్కరు అనుకుంటారు. కొందరు ఉన్న ఊరిలోనే ఘనంగా చేసుకుంటే మరికొందరు పర్యాటక ప్రాంతాలకు వెళ్తారు. ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు.

కరోనా వ్యాప్తి మొదలయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బయటకు వెళ్లాలంటేనే బయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటిది వందలాదిమంది గుమిగూడే ప్రాంతానికి వెళ్లాలంటే అంతే సంగతి.

ఇప్పుడు మరో ముప్పు వచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ చాల వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజుల వ్యవధిలో కేసులు రెట్టింపవుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితిలో ఎంత జాగ్రత్తగా ఉండాలి.

కానీ మనకు జాగ్రత్తలేదు. ప్రాణాల మీద భయం లేదనే విషయం మరోసారి స్పష్టమైంది. ఇదుగో ఈ వీడియో చూడండి.

ఇది గోవాలని బగా బీచ్ (baga beach) పక్కనే ఉన్న ఓ గల్లీ. ఇందులో జనం ఎలా కిక్కిరిసి ఉన్నారో చూడండి. న్యూ ఇయర్ కోసం వేలాది మంది రావడంతో గల్లీ ఇలా కిక్కిరిసిపోయింది.

ఈ స్థాయిలో జనం గుమిగూడిన తర్వాత కరోనా రమ్మంటె రాదా..? మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా.

Read Also :