CM KCR ON CHINA BORDER : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఉతికి ఆరేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలుచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలొచ్చిన ప్రతీసారి సరిహద్దు వివాదాలురెచ్చ గొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అయితే.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మరో విషయాన్ని ప్రస్తావించారు. అరుణాచల్ ల్ ప్రదేశ్ లో సరిహద్దు దాటి వచ్చిన చైనా సైన్యం గ్రామాలు నిర్మిస్తోందని.. అయినా మన సర్కారు పట్టించుకోవడం లేదని కేసీఆర్ చెప్పారు. దీనిపై బీజేపీ నేతలు స్పందించడం లేదు.
వాస్తవానికి రెండురోజుల క్రితమే అమెరికా రక్షణ వ్యవస్థకు గుండెకాయ అయిన పెంటగాన్ ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఫొటోలతో సహా తమ రిపోర్ట్ ను అందజేసింది. చైనా మిలిటరీకార్యకలాపాలపై ఇచ్చిన రిపోర్ట్ లో ఈ వివరాలు వెల్లడించింది.
2020 మే నుంచి పీపుల్ లిబరేషన్ ఆఱ్మీ అంటే చైనా సైన్యం భారత సరిహద్దులోకి చొరబడుతోందని.. భారత ఆధీనంలో ఉన్న చాలా భూభాగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుందని ఈ రిపోర్ట్ లో చెప్పింది. టిబెట్, జిన్ జియాంగ్ మిలిటరీ కూడా సరిహద్దులో మోహరించిందని అమెరికా ఇచ్చిన రిపోర్ట్ లో వెల్లడించింది.
గతేడాదిలోనే సరి నదీ ఒడ్డున ఓ గ్రామాన్నికూడా నిర్మించిందని చెప్పింది. వివాదాస్పద భూమిలో 100 ఇళ్లు నిర్మించింది చైనా. అంతే కాదు.. భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలో, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర, కొన్ని ప్రాంతాల్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లోపల మౌలికవసతులు కల్పిస్తోందని పెంటగాన్ రిపోర్ట్ చెబుతోంది.
పైగా భారత్ తమ భూభాగంలోకి చొరబడిందని చైనా(CHINA BORDER) ఆరోపిస్తోంది. ఈ వివాదంలోనే గతంలో గాల్వాన్ లోయలో మన సైనికుల ప్రాణాలు తీసింది చైనా ఆర్మీ. ఆ తర్వాత కూడా చాలా సార్లు గొడవలు జరిగాయి. చాలా కాలంగా చైనా సరిహద్దులో గొడవలు జరుగుతున్నాయని మనం పేపర్ లో వార్తలు చూస్తూనే ఉన్నాం.
కానీ కేంద్రం మాత్రం.. సరిహద్దులో చైనా చేస్తున్న ఆకృత్యాలను అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుందనేది మాత్రం చెప్పడం లేదు. చైనా సైన్యం మాదిరిగా మన సైన్యం ముందుకు దూసుకెళ్లి లైన్ యాక్చువల్ కంట్రోల్ ను పరిరక్షిస్తోందని ప్రకటనలు ఇవ్వడం లేదు.
కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం జమ్మూకశ్మీర్ సరిహద్దును వాడుకుంటోంది. ఎలక్షన్లు వస్తే చాలు.. కశ్మీర్ లో ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. మన సైనికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. పాలకులకు ఓట్లు పడుతున్నాయి.
నోట్ల రద్దుతో కశ్మీర్ లో ఉగ్రవాదం తగ్గిపోతుందని చెప్పిన పాలకులు, వారి మాటలు నమ్మి ఉపన్యాసాలిచ్చే కుహానా మేధావులు.. ఇప్పుడు కశ్మీర్ లో జరుగుతున్న మారణఖాండ గురించి మాత్రం మాట్లాడటం లేదు. ప్రతి రోజు ఒకరిద్దరు సైనికులు అమరులవుతోంటే.. వారి భౌతిక కాయాలు.. తమకు ఓట్లు తెచ్చిపెట్టే వస్తువులుగా చూస్తున్నారు పాలకులు.
ఇకనైనా ఈ పరిస్థితి మారాలి. ఓట్ల కోసం మన సైనికులు ప్రాణాలు బలవ్వడం ఆగాలి. మన సరిహద్దును మింగేస్తున్న చైనాపై యాక్షన్ మొదలు పెట్టి దేశాన్ని కాపాడేలా కేంద్ర పాలకులపై ఒత్తిడి తీసుకురావాలి.
Read Also :
- KCR Mark Dialogues : మంది మాటలు వట్టుకుని మార్వానం బోతే…!
- KCR : బండి సంజయ్‌ని బజారున నిలవేట్టిన కేసీఆర్..!
- KCR : కాసేపట్లో సీఏం కేసీఆర్ ప్రెస్ మీట్..!
- Hyderabad : సదర్ ఉత్సవాల్లో భీభత్సం.. మహిళను ఈడ్చుకెళ్లిన దున్నపోతు..!
- EATALA RAJENDER :బీజేపీ బీ-ఫామ్ పై… ఇండిపెండెంట్ గా గెల్చిన ఈటల
- KCR ATTITUDE : సారూ.. ఇగనన్న సోయికొస్తవా..?
- Telangana congress : ఫస్ట్ అటెంప్ట్ లోనే రేవంత్ ఫెయిల్.. దుమ్ముదులుపుతున్న సీనియర్లు..!
- Huzurabad By poll :కొంపముంచిన ‘దళితబంధు’.. కేసీఆర్ లెక్కలు తారుమారు..!
- Huzurabad Bypoll : చాణక్య నీతా.. రేవంత్ దొంగాటా..?
- Petrol And Diesel : పెట్రో మంటలు.. తగ్గేదే..లే.. ! త్వరలో వంట గ్యాస్ మరో వంద..!