Arvind Kejriwal : ఇవాళే ఆప్ సీఎం క్యాండిడేట్ ప్రకటన
Latest National News

Arvind Kejriwal : ఇవాళే ఆప్ సీఎం క్యాండిడేట్ ప్రకటన

Arvind Kejriwal : వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ఈ రోజు కేజ్రీవాల్ ( Arvind Kejriwal) ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలిపింది. రాష్ట్ర ప్రజల నుంచి పార్టీకి అందిన అభిప్రాయం మేరకే అభ్యర్థిని కేజ్రీవాల్ ప్రకటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పేరును ప్రకటించేందుకు కేజ్రీవాల్ శుక్రవారం అహ్మదాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ఎస్ఎంఎస్, వాట్సాప్, వాయిస్ మెయిల్, ఈ-మెయిల్ ద్వారా తెలియజేయాలని గత వారం కేజ్రీవాల్( Arvind Kejriwal) ప్రజలను కోరారు. నవంబర్ 3 సాయంత్రం వరకు ప్రజలు నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా మరుసటి రోజు పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటిస్తామని కేజ్రీవాల్ చెప్పారు.

కాగా ఇప్పటికే ఆప్118 అభ్యర్థులను ప్రకటించింది. 182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెలలో రెండు దశల్లో – డిసెంబర్ 1, 5 తేదీల్లో ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Also Read :