Arvind Kejriwal : పంజాబ్‌లో అధికారం పైన కన్నేసింది ఆమ్ ఆద్మీ పార్టీ(Arvind Kejriwal).. అక్కడ ఆ పార్టీ ఇప్పుడు రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. ఈసారి ఎలాగైనా కుర్చీ తమదే కావాలని గట్టిప్రయత్నాలే చేస్తోంది. అందులో భాగంగానే ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక హామీలిస్తోంది.
తాజాగా పంజాబ్‌కి రెండు రోజుల పర్యటనకి వచ్చిన ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రివాల్ సోమవారం మోగలో పర్యటించారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే 18 ఏళ్ళు నిండిన ఒక్కో మహిళకు నెలకు రూ.1000 చొప్పున ఇస్తామని ప్రకటించారు.
తల్లిదండ్రుల పైన భారం పడకుండా చదువుకోవాల్సిన అమ్మాయిలకి ఆ నగదు ఉపయోగపడుతుందని అన్నారు. దీనిని అతిపెద్ద మహిళా సాధికారత కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు. అయితే దీనిని నెటిజన్లు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
దేశంలో ఉన్న నాయకుల్లో అంతో గొప్పో మీ మీద గౌరవం ఉంది. కానీ చివరికి మీరు కూడా మారిపోయారు కేజ్రివాల్ సార్.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తెలుగు రాష్టాల సీఎంలని కొంపదీసి ఫాలో అవుతున్నారా ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
ప్రజల ఆర్థిక శక్తి పెంచండి.. అంతేగానీ ఫ్రీ స్కీమ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు.. విద్య, వైద్యం, అభివృద్ధి, ఉపాధి, భద్రత ఇవ్వండి ఇవి చాలు అంటూ సూచిస్తున్నారు. దయచేసి జనాలను చైతన్యవంతులను చేయకపోయిన ఫర్వాలేదు కానీ ఇలాంటి పధకాలు పెట్టి సోమరిపోతులను చేయకండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read :
- Priyanka Chopra : విడాకులకి సూటి వెట్టిన ప్రియాంక .. హింట్ ఇచ్చేసింది..!
- Chandrababu Naidu : చంద్రబాబుకి అవమానం జరిగిందని మహిళా ఉద్యోగి రాజీనామా
- Vijayashanthi : ప్రజల్ని మోసం చేసుట్ల కేసీఆర్ పిహెచ్డీ చేసిండు..!
- KCR Delhi: ఢిల్లీకి సీఎం కేసీఆర్ భార్య.. ఊపిరితిత్తులు సమస్యతో బాధపడుతూ..!
- Rekha Boj : ‘రారా సామీ’ కవర్ సాంగ్.. అబ్బ దుబ్బరేపినవ్ పో..!