Archana Gautam : బికినీ వేస్తే వావ్ అన్నారు.. ఎన్నికల్లో పోటీ చేస్తే ఛీ పో అన్నారు
Latest National News

Archana Gautam : బికినీ వేస్తే వావ్ అన్నారు.. ఎన్నికల్లో పోటీ చేస్తే ఛీ పో అన్నారు

Archana Gautam : నిన్న వెలువడిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో నాలుగు రాష్ట్రాలలో బీజేపీ సూపర్ హిట్ కొట్టింది. ఇక యూపీలో అయితే బ్లాక్‌‌బస్టర్ షోనే అనే చెప్పాలి. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసి సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచింది మోడల్ కమ్ పొలిటీషియన్ అర్చనా గౌతమ్‌(Archana Gautam).. మిస్ బికినీ యూనివర్స్ ఇండియా 2018 అయిన అర్చనా గౌతమ్‌ కాంగ్రెస్ తరుపున హస్తినాపుర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అతిదారుణంగా ఓడిపోయింది.

Image

కేవలం ఆమెకి 1519 ఓట్లు మాత్రమే వచ్చాయి. ముందునుంచి ఈ నియోజకవర్గంలో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ కాంగ్రెస్‌ అభ్యర్థి అయిన అర్చనా గౌతమ్‌ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వచ్చారు. అయితే కౌంటింగ్‌‌కి వచ్చేసరికి ఎస్పీకి చెందిన యోగేష్ వర్మపై బీజేపీ అభ్యర్ధి దినేష్ ఖటిక్ విజయం సాధించారు.

Image

ఆయన 7,312 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దినేష్ ఖటిక్ 1,07,002 ఓట్లు రాగా, యోగేష్ వర్మకు 99,827 ఓట్లు వచ్చాయి. ఇక బీఎస్పీకి చెందిన సంజీవ్ కుమార్ 14,176 ఓట్లు వచ్చాయి. ఏఐఎంఐఎంకు చెందిన వినోద్ కుమార్ 4,282 ఓట్లతో నాలుగో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి అర్చనా గౌతమ్‌కు కేవలం 1,500 ఓట్లతో ఐదో స్థానంలో నిలిచారు.

Also Read :

May be an image of 4 people, people standing and outdoors

అర్చనా గౌతమ్‌కి కాంగ్రెస్ టికెట్ ప్రకటించిన రోజు నుండి సోషల్ మీడియాలో ఆమె పైన వీపరితంగా ట్రోల్ నడిచింది.. సోషల్ మీడియాలో అర్చనా బికినీ ఫోటోలు, వీడియోలు పెడుతూ ప్రతిపక్షాలు ఆమెను ట్రోల్ చేస్తూనే వచ్చాయి.

అర్చనాకు మద్దతుగా ప్రియాంక గాంధీ స్వయంగా ముందుకు వచ్చి ప్రచారం చేసినప్పటికీ ఓటర్లని ఆకట్టుకోలేకపోయింది.

May be an image of 5 people, people standing and outdoors

2015లో బాలీవుడ్‌లోకి నటీగా ఎంట్రీ ఇచ్చింది అర్చనా… ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ థీ’ ఆమెకి మొదటి సినిమా.. ఆ తర్వాత హసీనా పార్కర్, బారాత్ కంపెనీ, జంక్షన్ వారణాసి చిత్రాల్లో నటించింది. హిందీ సినిమాలతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో కూడా నటించింది.. నటన అనంతరం రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న అమె గతేడాది నవంబర్‌లో కాంగ్రెస్‌లో చేరింది.