Amitshah : అబ్బబ్బా.. ఏం ప్లానేశారు సార్.. అద్భుతహా..!
Latest National

Amitshah : అబ్బబ్బా.. ఏం ప్లానేశారు సార్.. అద్భుతహా..!

Amitshah game plan in Punjab : పంజాబ్ కాంగ్రెస్ ను చీల్చడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యింది బీజేపీ. ఇటీవలే సీఎం పదవికి రాజీనామా చేశారు అమరిందర్ సింగ్. తర్వాత చరన్ జిత్ సింగ్ చన్నీని సీఎంగా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం.

సీఎం పదవికి రాజీనామా చేశాక ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు అమరిందర్ సింగ్. మోడీ, అమిత్ షాతో భేటీ అయ్యారు. రహస్యంగా మరికొందరు ముఖ్యనేతలతోనూ భేటీ అయినట్టు తెలుస్తోంది.

సీఎం పదవి నుంచి తప్పుకున్నాక అమరిందర్ సింగ్ బీజేపీ(Amitshah)లో చేరతారని అంతా భావించారు. కానీ దానికి భిన్నంగా చాలా తెలివిగా ఓ నిర్ణయం తీసుకున్నారు అమరిందర్ సింగ్. బీజేపీలో చేరడం లేదని.. తానే కొత్తగా ఓ పార్టీ పెట్టబోతున్నట్టు చెప్పారు.

దీని వెనకా క్రిస్టల్ క్లియర్ గా బీజేపీ గేమ్ ప్లాన్ ఉంది.

వచ్చే ఏడాదిలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి టైంలో అమరిందర్ సింగ్ బీజేపీలో చేరితే పంజాబ్ లో బీజేపీకి చాలా నష్టం. అమరిందర్ పై ఉన్న వ్యతిరేకతతో పాటు.. వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతుల నుంచి ఎదురుదెబ్బ పడుతుంది. ఉన్న ఓటు బ్యాంకు కూడా కోల్పోయే ప్రమాదముంది.

పంజాబ్ లో బీజేపీ అధికారంలోకి రావాలంటే అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఓట్లు చీల్చాలి. ఇప్పుడు ఆ ప్లాన్ లో భాగంగానే అమరిందర్ ను చేరదీసింది బీజేపీ. అమరిందర్ సింగ్ పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా బీజేపీ సలహానేనని తెలుస్తోంది.

కొత్తగా పార్టీ పెట్టి.. అభ్యర్థులను బరిలోకి దించితే.. అమరిందర్ సింగ్ సానుభూతిపరుల ఓట్లన్ని కాంగ్రెస్ అకౌంట్ లో మైనస్ అవుతాయి. ఇది బీజేపీకి ప్లస్ అవుతుంది. అమరిందర్ పార్టీకి కొన్ని సీట్లు వచ్చినా.. ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుని అమరిందర్ సింగ్ మళ్లీ ప్రభుత్వంలో కొనసాగవచ్చు.

Read Also :