Air india  : పాత విమానానికే కొత్తగా రెక్కలొచ్చాయి..! వెల్కం చెప్పిన టాటా
Latest National

Air india : పాత విమానానికే కొత్తగా రెక్కలొచ్చాయి..! వెల్కం చెప్పిన టాటా

Air india bid won by TATA SONS-key ponits : ఎయిరిండియా ప్రైవేటైజేషన్ ఓ కొలిక్కి వచ్చింది. ఎయిరిండియాను టాటా సన్స్ కంపెనీ కొనుగోలు చేసింది. అందరికంటే ఆకర్షణీయంగా ఉండటంతో టాటా సన్స్ కే బిడ్ ఖరారు చేసినట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఎయిరిండియా పూర్తిగా టాటాల చేతుల్లోకి వెళ్లిపోయింది. డిసెంబర్ లోగా బదిలీ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

అసలు ఏంటీ ఎయిరిండియా వ్యవహారం..? కీలక అంశాలు
  • 68 ఏళ్ల తర్వాత తిరిగి టాటాల చేతుల్లోకి ఎయిరిండియా.
  • ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ పూర్తిగా టాటాల చేతుల్లోకి. ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో 50 శాతం వాటా టాటాల సొంతం.

– 2021 ఆగస్టు ఆఖరుకు ఎయిరిండియాపై రూ.61,562 కోట్ల అప్పుల భారం

– ఐదేళ్ల వరకు ఎయిరిండియా బ్రాండ్ లోగోను ఎవరికీ బదిలీ చేయొద్దు. చేయాల్సి వస్తే భారతీయులకు మాత్రమే చేయాలని కండీషన్.

– ఎయిరిండియాకు 4400 డొమెస్టిక్ విమానాలు, అంతర్జాతీయ ప్రయాణాలకు 1800 ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్ లు, విదేశీ విమానాశ్రయాల్లో 900 స్లాట్ లు ఎయిరిండియా సొంతం.

– ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను ఎడాది పాటు కొనసాగించాలని కండీషన్.

– ఎయిరిండియా ఎయిర్ లైన్స్ ను ప్రారంభించింది కూడా టాటాలే.

– 1932లో టాటా ఎయిర్ లైన్స్ పేరుతో ప్రారంభం

– 1953లో జాతీయీకరణ చేయడంతో ప్రభుత్వ రంగ సంస్థగా మారిన ఎయిరిండియా.

గతంలో మంచి లాభాల్లో కొనసాగిన ఎయిరిండియాపై క్రమంగా అప్పుల భారం పెరిగిపోయింది. ఆ భారాన్ని ప్రభుత్వం భరించలేకపోయింది. సర్కారుకు కూడా తీవ్ర భారంగా మారడంతో ఎయిరిండియా ప్రైవేటీకరణకు మోడీ సర్కారు అంకురార్పణ చేసింది. చాలా ఏళ్లుగా నడుస్తున్న ప్రైవేటీకరణ వ్యవహారం ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చింది. తిరిగి ఆ సంస్థను ప్రారంభించిన వారి చేతుల్లోకే వెళ్లిపోయింది.

 

Read Also :