Indian embossy in Kabul: తాలిబన్లకు షాక్.. మనోళ్లను తీసుకొచ్చారు.. గ్రేట్ IAF.
Latest National News

Indian embossy in Kabul: తాలిబన్లకు షాక్.. మనోళ్లను తీసుకొచ్చారు.. గ్రేట్ IAF.

Afghanistan under Taliban watch.. Staff of Indian embossy in Kabul safely evacuated : అఫ్గనిస్తాన్ ను తాలిబాన్లు కంప్లీట్ గా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరీ ముఖ్యంగా కాబూల్ లో వందలాది మంది తాలిబాన్లు సాయుధులైన పహారా కాస్తున్నారు. అఫ్గనిస్తాన్ ప్రజలే ఎటూ వెళ్లలేని పరిస్థితి.

కానీ కాబూల్ లో ఇండియన్ ఎంబసీ ఉంది. అందులో పదుల సంఖ్యలో ఉద్యోగులు, మన దేశ భద్రతా సిబ్బంది కాబూల్ లో ఉండిపోయారు. బయట పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడే ఉంటే ప్రాణాలు ఉంటాయో.. పోతాయో కూడా తెలియని పరిస్థితి. మూర్ఖులైన తాలిబాన్లు ఎంబసీలోకి చొరబడితే అధికారుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

kabul airport

అలాంటి ప్రమాదం జరిగే లోపే వారిని దేశానికి తీసుకురావాలి.

కానీ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఎలాగోలా ఎంబసీ నుంచి బయటకొచ్చినా.. కాబూల్ ఎయిర్ పోర్టులో వందలాది మంది అఫ్గాన్లు విమానాలు ఎక్కేందుకు ఎదురుచూస్తున్నారు. రన్ వే పై జనాలుండగా.. ఫ్లైట్ ల్యాండింగ్, టేకాఫ్ అవడం కష్టం.

కానీ.. ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన ధైర్యసాహసాలు మరోసారి ప్రదర్శించింది. ఓ కీలక ఆపరేషన్ నిర్వహించి ఎంబసీ ఉద్యోగులను రాత్రికి రాత్రి ఇండియా తీసుకొచ్చింది.

kabul airport 1

అతికష్టం మీద నిన్న ఉదయం కొంతమందిని ఎయిర్ పోర్టు వరకు తీసుకెళ్లగలిగారు. దారిలో తాలిబాన్లు అడ్డుకున్నారు. ఉద్యోగుల దగ్గరున్న విలువైన వస్తువులు, వారి సామగ్రి లాగేసుకున్నారు. ఎలాగోలా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కానీ అక్కడ వేలాది మంది అఫ్గన్ ప్రజలున్నారు. అయినా.. వేరే మార్గంలో వారిని ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లి ఫ్లైట్ ఎక్కించి భారత్ తీసుకొచ్చారు.

మరికొందరు మాత్రం ఎంబసీలోనే ఉండిపోయారు. వారిని తీసుకురావడం చాలా కష్టంగా మారింది. ఎంబసీ నుంచి బయటకొస్తే తాలిబాన్లున్నారు. వారు తమను సేఫ్ గా వెళ్లనిస్తారో లేదో తెలియదు. అటు ఎయిర్ పోర్టులోనూ సమస్య ఉంది.

iaf flight in kabul

మిడ్ నైట్ కీ ఆపరేషన్ :

ఏది ఏమైనా మనఉద్యోగులను సేఫ్ గా దేశానికి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు అధికారులు. ఇప్పటికీ అమెరికా బలగాలు ఎయిర్ పోర్టులో ఉన్నాయి. అందుకే రాత్రికి రాత్రి అమెరికా విదేశాంగమంత్రితో మాట్లాడారు మన విదేశాంగ మంత్రి జైశంకర్. దీంతో అక్కడున్న అమెరికా బలగాలు.. మన ఉద్యోగులకు భద్రత కల్పించాయి.

అమెరికా భద్రత సహకారంతో అఫ్గనిస్తాన్ లో భారత రాయబారి, ఇతర ఉద్యోగులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి వారు సేఫ్ గా ఇవాళ ఉదయం 9.30 తర్వాత ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. కాబూల్ లోని ఎంబసీ ఉద్యోగులంతా సేఫ్  గా దేశానికి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.