Rahul Gandhi : ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన పుష్ప ముంజియాల్ అనే 78 ఏళ్ల వృద్ధురాలు తన 50 లక్షల ఆస్తులు, 10 తులాల బంగారంతో సహా తన ఆస్తులన్నింటినీ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పేరు మీద రాసేసింది. ఇందుకు సంబంధించి వీలునామా సిద్ధం చేసి డెహ్రాడూన్ కోర్టులో సమర్పించింది.
తన వీలునామాలో రాహుల్ గాంధీ తన వారసుడిగా పేర్కొంది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని ముంజియాల్ పేర్కొంది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు దేశ సేవకే అంకితమయ్యారని పేర్కొంది.
తన తండ్రికి దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వృద్ధురాలు తెలిపింది. ఇక రాహుల్ గాంధీ ఆలోచనలు గొప్పవని, ఆయన ఆలోచనలకు తాను చాలా ప్రభావితమయ్యానని అందుకే తన ఆస్తిని ఆయనకు ఇస్తున్నానని తెలిపింది.
ఆమెకు సంబంధించిన ఆస్తి పత్రాలను కాంగ్రెస్‌నేత , ఉత్తరాఖండ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రీతమ్సింగ్కుఅందజేసినట్లు ఆ పార్టీ మెట్రోపాలిటన్ అధ్యక్షుడు లాల్‌చంద్ శర్మ తెలిపారు. జీవితాంతం పెళ్లి చేసుకోని ముంజియాల్ ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని ప్రేమ్‌ధామ్ వృద్ధాశ్రమంలో నివసిస్తున్నారు.
Also Read :
- Ramdev : నోరు మూసుకో.. మళ్లీ అడగకు… జర్నలిస్ట్ పై రెచ్చిపోయిన రామ్ దేవ్ బాబా..!
- Love Marriage : ప్రేమ, పెళ్లని చెప్పి కొంప కొల్లేరు చేసింది.. జీవితం నాశనం..!