మళ్ళీ 40 వేలకి పైగా కేసులు.. షాకిస్తున్న రీ ప్రొడక్షన్ నెంబర్..!
Latest National News

మళ్ళీ 40 వేలకి పైగా కేసులు.. షాకిస్తున్న రీ ప్రొడక్షన్ నెంబర్..!

దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. కరోనా తీవ్రతను కొలిచే రీ ప్రొడక్షన్ నెంబర్ పెరగడం ఇప్పుడు ఆందోళనకి గురిచేస్తుంది. ఆగస్టు 14-17 తేదీల మధ్య 0.89గా ఉన్న R-విలువ, ఆగస్టు 24-29 మధ్య 1.17కి చేరింది. ఇది 1 ఉంటే ఇన్ఫెక్షన్ సోకిన ప్రతి వంద మంది మరో వంద మందికి వ్యాపింపజేస్తున్నట్లు .. 1 దాటితే తీవ్రత మరింతగా పెరుగుతున్నట్లు అన్నమాట.

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,618 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 3.29కోట్లు దాటింది. మరోవైపు 36,385 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇక కరోనాతో మరో 330 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 4,40,225కి చేరింది.

కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసులు మళ్లీ 4లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,05,681 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 1.23శాతంగా ఉంది. దేశంలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. అక్కడ 29,322 కొత్త కేసులు బయటపడగా.. 131 మరణాలు నమోదయ్యాయి.

Also Read :