Sadhus : పిల్లలను ఎత్తుకుపోతున్నారని సాధువులను కొట్టిన్రు
Latest National News

Sadhus : పిల్లలను ఎత్తుకుపోతున్నారని సాధువులను కొట్టిన్రు

Sadhus : మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో నలుగురు సాధువులపై ఓ గుంపు దాడి దిగింది. పిల్లలను ఎత్తుకుపోతున్నారనే అనుమానంతో వారి పై కర్రలతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురు సాధువులు కర్ణాటకలోని బీజాపూర్ నుండి పంఢర్‌పూర్‌కు వెళుతుండగా ఒక బాలుడిని పిలిచి దారి అడిగారు. అయితే అక్కడి స్థానికులు వీరు పిల్లలను కిడ్నాప్ చేసే ముఠా అని అనుమానించి వారి పై దాడికి దిగారు.

ఈ దాడిలో సాధువులకు గాయలయ్యాయి. సాధువులను(Sadhus) కొందరు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు అంటున్నారు.

సాధువులపై జరిగిన క్రూరమైన దాడిని మహారాష్ట్ర బీజేపీ నేత రామ్ కదమ్ ఖండించారు. దోషులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు.

Also Read :