Metro Lift : అమ్మాయిలు కనిపిస్తే చాలు .. కొందరు చిల్లరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఢిల్లీ మెట్రో స్టేషన్‌లోని లిఫ్ట్‌లో(Metro Lift) ఓ మహిళను లైంగికంగా వేధించినందుకు 26 ఏళ్ల యువకుడిని ఢిల్లీ పోలీసులు ఏప్రిల్ 15న అరెస్టు చేశారు. ఈ సంఘటన ఏప్రిల్ 4న జరగగా చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో హౌస్‌కీపింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్న రాజేష్ కుమార్ అనే వ్యక్తి .. ఢిల్లీలోని జసోలా మెట్రో స్టేషన్‌లో లిఫ్ట్‌లో బాధిత మహిళతో కలిసి ఎక్కాడు. పక్కన ఎవరూ లేకపోవడంతో తనలో కామాంధుడు బయటకు వచ్చాడు. తన ప్రైవేట్ పార్ట్స్ ను బయటపెట్టి, వాటితో ఆ మహిళను తాకాడు. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన ఆ మహిళ భమపడిపోయి గట్టిగా అరించింది.
దీంతో రాజేష్ మెట్రో రైలు ఎక్కకుండానే అక్కడినుంచి పారిపోయాడు. అనంతరం ఆమె ఫిర్యాదు అఆధారంగా పోలీసులు రాజేష్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సెక్యూరిటీ కెమెరా ఫుటేజీ, లోకల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రాజేష్‌ని పట్టుకున్నారు. వేధింపులకు సంబంధించిన రాజేష్ పై చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అమ్మాయిలను మెట్రో స్టేషన్‌లోని వేధింపులకు గురిచేయడం ఇదేం కొత్తకాదు. గతేడాది జూలైలో జోర్ బాగ్ మెట్రో స్టేషన్‌లో మహిళను లైంగికంగా వేధించినందుకు 40 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.