home page

LockDown : జూన్ 30 వరకు లాక్ డౌన్..! నిజమేనా..?

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నట్టే ఉన్నా.. యాక్టీవ్ కేసులు మాత్రం తగ్గడం లేదు.
 | 
lockdown updates

- జూన్ 30 వరకు లాక్ డౌన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం

- వైరల్ అవుతున్న కేంద్ర హోంశాఖ లేఖ

- హోంశాఖ లెటర్ లో ఏముంది..?

- నిజంగానే లాక్ డౌన్ పొడిగిస్తారా..?

నిన్న ఉదయం నుంచి ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్లుగా చక్కర్లు కొడుతోంది. ఎవరి వాట్సప్ స్టేటస్ చూసినా... ఓ లెటర్ కనిపిస్తోంది. జూన్ ఆఖరు వరకు లాక్ డౌన్ అంటూ ఆ స్టేటస్ కింద కామెంట్ కూడా ఉంటోంది.

దాదాపుగా గత నెల రోజులుగా దేశమంతటా లాక్ డౌన్ పరిస్థితులే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూ పేరుతో, మరికొన్ని రాష్ట్రాల్లో ఆంక్షల పేరుతో లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణలోనూ 20 రోజులుగా లాక్ డౌన్ పెట్టారు. ఈ నెలాఖరుతో ఆ లాక్ డౌన్ ముగుస్తోంది.

ఇప్పుడు లాక్ డౌన్ ను పొడిగిస్తారా..? లేకపోతే తొలగిస్తారా అనే దానిపై ప్రజల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఫస్ట్ వేవ్ లో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ప్రస్తుతం ఏ రాష్ట్రానికి.. ఆ రాష్ట్రమే లాక్ డౌన్ పెట్టుకుంది. లాక్ తొలగించాలన్నా... పొడిగించాలన్నా అది ఆ రాష్ట్రం నిర్ణయం మేరకే జరుగుతుంది.

కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లెటర్ మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్న్ అజయ్ భల్లా పేరుతో వచ్చింది.

ఇంతకీ అందులో ఏముంది...?

కరోనా కేసులు పెరుగుతుండటంతో.. గత నెల అంటే ఏప్రిల్ లో కేంద్రం కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి రాష్ట్రాలకు కొన్నిసూచనలు చేసింది. కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని చెప్పింది.

కేసులున్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా పరిగణించి అక్కడ పటిష్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా.. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని కేంద్రం చెప్పింది. వైరస్ వ్యాప్తి తగ్గుతున్నట్టే అనిపిస్తున్నా.. యాక్టీవ్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని.. జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.

కంటైన్మెంట్ జోన్ల పరిధిలో సడలింపుల విషయంలోనూ పలు సూచనలు చేసింది. గ్రేడ్ విధానంలో సడలింపులు ఇవ్వాలని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా కలెక్టర్లు పరిస్థితిపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ నిర్ణయాలు తీసుకోవాలంది.

అయితే.. ఇందులో ఎక్కడా కూడా రాష్ట్రాల్లో జూన్ ఆఖరు వరకు లాక్ డౌన్ అనే విషయం లేదు. అంతేకాదు.. రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగించాలంటూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చే పరిస్థితి కూడా లేదు.

ఇక.. తెలంగాణ విషయానికిస్తే.. ఈ నెలాఖరుతో లాక్ డౌన్ గడువు ముగుస్తోంది. కానీ.. కేసులు మాత్రం పెద్దగా తగ్గినట్టు కనిపించడం లేదు. అందుకే రాష్ట్రంలో మరికొన్ని రోజులు లాక్ డౌన్ కొనసాగించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. వారం నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించే ఛాన్స్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Read Also :

కరోనా చావులకు అసలు కారణాలేంటి..?

ఈటల రాజేందర్... రెడ్డి..? బీసీ..? కన్ఫ్యూజన్ కథలు..!

అనసూయ అందాలు అదరహో..!

ఇమ్యూనిటీ పెంచే మల్లెపూల ఛాయ్..!

తిన్నది అరగడం లేదా..? అయితే ఇలా చేయండి..!

తెలంగాణ బీజేపీ మాస్టర్ ప్లాన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

పత్తిత్తు మీడియా ప్రవచనాలు.. అందరూ ఆ బాపతే..!! 

అబ్బాయిలకి ఫుల్ క్రష్ గా మారిన 30 weds 21అమ్మాయి..! 

తెల్ల చీర.. తెల్లతోలు.. అబ్బబ్బా.. ఏమి అందం.. 

అందాల దివి... ఒక్కో ఫోటో అరాచకం..!