షర్మిలకి ఈగో.. విజయమ్మకి మాట్లాడరాదు..  ‘కొండా సురేఖ’ హాట్ కామెంట్స్..!
Latest News Telangana

షర్మిలకి ఈగో.. విజయమ్మకి మాట్లాడరాదు.. ‘కొండా సురేఖ’ హాట్ కామెంట్స్..!

వైఎస్ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో కొండా దంపతులు ఒకరు.. వైఎస్ మరణం తర్వాత ఆ ఫ్యామిలీతో కొంచం గ్యాప్ అయితే వచ్చింది. ఇందుకు రాష్ట్ర విభజన కూడా ఓ కారణం అని చెప్పవచ్చు. తెలంగాణ ఏర్పడ్డాక 2014లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖ.. ఆ తరవాత 2018లో తిరిగి కాంగ్రెస్ లో చేరి ఆ ఎన్నికల్లో ఓడిపోయారు.

ఆ తర్వాత పాలిటిక్స్ లో ఆమె యాక్టివ్ గా ఉండడం కూడా తగ్గించారు. తాజాగా రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి వచ్చాకా మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇదిలావుండగా తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో వైఎస్ షర్మిల గురించి హాట్ కామెంట్స్ చేశారు కొండా సురేఖ.

Konda Surekha MLA of Warangal East Telangana contact address & email

వైఎస్ షర్మిలకు ఇగో ఉంటుందని, ఆమె పార్టీ పెట్టాక పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం కూడా వచ్చిందని అన్నారు. జగన్ జైలుకు వెళ్లిన తర్వాత షర్మిల పాదయాత్ర చేసే సమయంలో తాను ఆమె తీరు చూశానని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో రాణించాలంటే ఆ స్వభావం ఉండకూడదని అన్నారు.

ఇక షర్మిల కేవలం అధికారం కోసమే ఇక్కడ పార్టీ పెట్టిందని సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు విజయమ్మ పైన కూడా కీలక వ్యాఖ్యలు చేశారు సురేఖ. పబ్లిక్ మీటింగ్లో ఎలా మాట్లాడాలో విజయమ్మకు తెలియదని, జనాలేమి పిచ్చోళ్ళు కాదని అన్నారు.

YS Sharmila to launch party in May or July

వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్న కొండా సురేఖ ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

Also Read :