మోత్కుపల్లికి సీఎం కేసీఆర్ కీలక పదవి..!
Latest News Telangana

మోత్కుపల్లికి సీఎం కేసీఆర్ కీలక పదవి..!

Motkupalli Narasimhulu : హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ముందునుంచి పావులు కదుపుతున్నారు సీఎం కేసీఆర్. అందులో భాగంగానే రోజుకో వ్యూహాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇప్పటికే దళితబంధు స్కీమ్ ని తెరపైకి తీసుకువచ్చిన కేసీఆర్ ఇతర పార్టీలకి చెందిన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగానే ఇతర పార్టీలో నుంచి వచ్చిన లీడర్ లకి కీలక పదువులు ఇస్తున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ నుంచి వచ్చిన కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు. ఇక తాజాగా బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ కి సపోర్ట్ చేసిన మోత్కుపల్లి నర్సింహులుకి కీలక పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దళితబంధు పథకానికి వీలైనంత త్వరగా చట్టబద్ధత కల్పించి దానికి చైర్మెన్ గా నామినేట్ చేయాలనీ కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే మోత్కుపల్లి బీజేపీకి రాజీనామా చేసినా అధికారికంగా టీఆర్‌ఎస్‌లో చేరలేదు.

Also Read : జారిపోయే నడుముతో ప్రియాంక వలుపుల వల..!