రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. నేటి నుంచి ఖాతాల్లోకి..!
Latest News Telangana

రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. నేటి నుంచి ఖాతాల్లోకి..!

రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది.ఇన్ని రోజులనుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుణమాఫీ ఫలితం ఈ రోజు దక్కనుంది. రూ.50 వేల లోపు ఉన్న పంట రుణాలను నేటి నుంచి మాఫీ చేయనుంది కేసీఆర్ సర్కార్.

ఇప్పటికే మొదటి విడతలో రూ. 25 లోపు రుణం తీసుకున్న అన్నదాతలకి రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు రూ. 50 వేల లోపు రుణమాఫీ చేయనుంది. దీనితో ఆరు లక్షలకి పైగా రైతులకి లబ్ది చేకూరనుంది దీనికోసం ప్రభుత్వం ఏకంగా రెండు వేల కోట్ల పైగా ఖర్చు చేస్తుంది.

ఈ రోజు నుంచి ఈ నెల చివరి లోపు రూ. 25 వేల నుంచి రూ.50 వేల వరకు పంటరుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు.

Also Read :