home page

ఇమ్యూనిటీ పెంచే మల్లెపూల ఛాయ్..!

మల్లెలతో చాలా ఉపయోగాలున్నాయంటున్న ఎక్స్ పర్ట్స్
 | 
jamine tea for immunity

- లైంగిక వాంఛ పెంచే మల్లెలు

- ఇమ్యూనిటీ బూస్టర్ గా పనికొచ్చే జాస్మిన్ టీ

- దంత సమస్యలకు జాస్మిన్ టీ తో చెక్

మల్లెపూల గుబాళింపుతో మైమరిచిపోని వారు ఉండరు. మల్లెల ఘుమఘమలు ఎంతైటి వారినైనా కట్టిపడేస్తాయి. అందుకే మల్లెపూలంటే అంత ప్రత్యేకత. మల్లెలంటే ఇప్పటి వరకు కేవలం కొన్ని అంశాలే మదిలో మెదులుతాయి. స్త్రీలు జడలో పెట్టుకుంటారు.. శోభనం గదిలో అలంకరిస్తారని.. చాలా మందికి తెలుసు.

కానీ వీటిని భిన్నంగా మల్లెలతో మరో అద్భుతమైన ఉపయోగం ఉందంటున్నాయి అధ్యయనాలు. అదే జాస్మిన్ టీ. మల్లెపూలతో టీ కూడా తయారుచేస్తారట. ఇది ఆరోగ్యానికి ఎంతోమంచిదని చెబుతున్నారు. చైనా,జపాన్ వంటి దేశాల్లో జాస్మిన్ టీ ఎక్కువగా వాడతారు.

జాస్మిన్ టీలో చాలా ఔషధగుణాలున్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. షుగర్ వ్యాధి ఉన్నవారికి జాస్మిన్ టీ బెటర్ ఆప్షన్ అంటున్నారు. జాస్మిన్ టీలో ఉండే ఔషధగుణాలు.. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయట. సో రెగ్యులర్ గా జాస్మిన్ టీ తీసుకుంటే.. షుగర్ పేషెంట్లు నిశ్చింతంగా ఉండొచ్చన్నమాట.

అంతేకాదు.. రక్తంలో తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రొటీన్ లను ఇది అదుపులో ఉంచుతుంది. దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, పక్షవాతం వంటివి రాకుండా చూస్తుందట. అంతేకాదు.. శరీరంలో ఇమ్యూనిటీని పెంచేందుకు కూడా తోడ్పడుతుందని చెబుతున్నారు.

ఇవే కాదు.. చిగుళ్లు, దంత సమస్యలు, అల్సర్ల వంటి వాటికి జాస్మిన్ టీ తో చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. వీటితో పాటు.. దగ్గు,జలుబు, అలర్టీల నుంచి కూడా ఇది మంచి రిలీఫ్ ఇస్తుందట. కండరాల నొప్పుల నుంచి విముక్లి కలిగించడంతో పాటు.. లైంగికవాంఛను కూడా పెంచుతుందట.

ఇన్ని అద్భుతమైన ఉపయోగాలున్న జాస్మిన్ టీ ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం

తాజా మల్లె మొగ్గలు తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి బౌల్ లో వేసుకోవాలి. ఒక స్పూన్ టీ  పొడికి 7 రెట్లు అధికంగా మల్లె మొగ్గలు వేయాలి.

ఒక గిన్నెలో  పెద్ద గ్లాసు నీరు పోసి. బాగా మరిగించాలి. బాగా మరిగిన నీటిలో ముందు రెడీ చేసి పెట్టుకున్న మల్లెమొగ్గలు, టీ పౌడర్ వేసి మరింతసేపు మరిగించాలి. 5 నుంచి10 నిమిషాలు మరిగాక స్టవ్ ఆఫ్ చేసి వడబోయాలి. తర్వాత అందులో తేనె లేదా పటిక బెల్లం వేసి తాగాలి.

ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది.

ఇంట్లో తయారు చేసుకోవడం వీలు కాని వారు.. ఆన్ లైన్ లో కూడా కొనుగోలు చేయొచ్చు. అమెజాన్ తో పాటు చాలా ఆన్ లైన్ షాపింగ్ సైట్లలో జాస్మిన్ టీ ప్యాక్ లు అందుబాటులో ఉన్నాయి.

Read Also :

తిన్నది అరగడం లేదా..? అయితే ఇలా చేయండి..!

తెలంగాణ బీజేపీ మాస్టర్ ప్లాన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాందేవ్ బాబాపై దేశద్రోహం కేసు..! పెద్ద షాకిచ్చిన IMA..!

పత్తిత్తు మీడియా ప్రవచనాలు.. అందరూ ఆ బాపతే..!! 

అబ్బాయిలకి ఫుల్ క్రష్ గా మారిన 30 weds 21అమ్మాయి..! 

తెల్ల చీర.. తెల్లతోలు.. అబ్బబ్బా.. ఏమి అందం.. 

అందాల దివి... ఒక్కో ఫోటో అరాచకం..!