home page

Bank Updates : ఇవాళ్టి నుంచి బ్యాంకుల్లో చాలా మారాయి.. అవేంటో తెలుసుకోండి

 | 
important bank updates

ఏడాదిలో సగం గడిచిపోయింది. కరోనా టెన్షన్ తో దినదిన గండంగా రోజులు గడిచాయి. ఇవాళ్టితో ఏడాదిలోని సెకండాఫ్ లోకి ప్రవేశిస్తున్నాం. ఈ సెకండాఫ్ లో చాలా మారబోతున్నాయి. మన జేబులకు చిల్లులు పడేబోతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉంటే వాటి నుంచి బయటపడొచ్చు.

1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తమ ఏటీఎంలలో క్యాష్ విత్ డ్రా రూల్స్ మార్చింది. 4 సార్ల కంటే ఎక్కువగా కార్డుతో డ్రా చేస్తే.. ప్రతీ ట్రాన్సాక్షన్ కి 15 రూపాయల చార్జీ వసూలు చేస్తారు.

2.అంతే కాదు చెక్ బుక్ చార్జీలు కూడా మార్చింది స్టేట్ బ్యాంక్. ఏడాదిలో 10 చెక్కులు మాత్రమే ఫ్రీగా ఇస్తారు. ఆ తర్వాత మరో 10 చెక్కులు కావాలంటే 40 రూపాయలు, 25 చెక్కులకు 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

3. ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయని వారికి టీడీఎస్ పడుతుంది. ఐటీఆర్ దాఖలు చేయని వారికి టీడీఎస్ భారం మరింత ఎక్కువగా ఉండే అవకాశముంది.

4. సిండికేట్ బ్యాంక్ IFSC కోడ్ లు ఇవాళ్టి నుంచి పనిచేయవు. కెనరా బ్యాంక్ లో విలీనం కారణంగా ఇకపై కెనరా బ్యాంక్ IFSC కోడ్ లనే వాడాల్సి ఉంటుంది. కెనరా బ్యాంక్ వెబ్ సైట్ లో కోడ్ ల వివరాలు పొందుపరిచారు.

5. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యాయి. కాబట్టి ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకుల చెక్కులు ఇకపై పనిచేయవు. కస్టమర్లందరూ యూనియన్ బ్యాంక్ చెక్కులు తీసుకోవాల్సిందే.

6 దేనా బ్యాంక్, విజయ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం అయ్యాయి. కాబట్టి దేనా, విజయ బ్యాంకుల IFSC కోడ్ లు ఇకపై పనిచేయవు. బ్యాంక్ బరోడా కోడ్ లు వాడాల్సి ఉంటుంది.

Read Also:

ఈ ఏజ్ లో కూడా రెచ్చిపోతున్న ఈవివి హీరోయిన్..! 

ఒక్కో మామిడి పండును 10వేలు పెట్టి కొన్నాడు.. ఎందుకో తెలిస్తే హాట్సాఫ్ అనాల్సిందే..! 

రామచంద్రప్రభు వీళ్ళ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాం.. ప్రతి ప్రోమోలో ఎదో సోది..! 

రేవంత్‌‌‌‌‌కి పోస్ట్..  లాస్ అయ్యేది బీజేపీనే..! 

రేవంత్‌‌‌‌‌కి ఫస్ట్ టాస్క్ ఇదే.. కానీ హెవీ రిస్క్..! 

ప్యాంట్ మరిచింది.. షర్ట్ విప్పేసింది..!