home page

శభాష్ తెలంగాణ.. రెండో మేడిన్ ఇండియా వ్యాక్సిన్ మన హైదరాబాద్ నుంచే..

దేశానికే గర్వకారణంగా నిలుస్తున్న తెలంగాణ ఫార్మా రంగం
 | 
health ministry ordered 30 crore doses of biological e vaccine

దేశంలో వ్యాక్సిన్ కొరత పెరిగిపోతోంది. కేంద్ర భారత్ బయోటెక్, సిరం ఇనిస్టిట్యూట్ నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వ్యాక్సిన్ డోసుల నిల్వలు అయిపోతున్నాయి. దీంతో వ్యాక్సినేషన్ పై అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటికిప్పుడు పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లు ఎక్కడి నుంచి రావాలనేది సమస్యగా మారింది.

ఈ సమస్యకు చెక్ పెట్టింది హైదరాబాద్ లోని బయోలాజికల్ ఈ.  తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్ ను ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ లో ఉంది బయోలాజికల్ ఈ వ్యాక్సిన్. మన హైదరాబాద్ లో తయారైన వ్యాక్సిన్ 30 కోట్ల డోసులు కొనేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. దీనికోసం 1500 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా కూడా ఇచ్చింది.

ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ కొనసాగుతున్నాయని.. మొదటి దశల కంటే మంచి ఫలితాలు వస్తున్నాయని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఆగస్ట్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఇవి కేంద్ర ప్రభుత్వానికి అందనున్నాయి. బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ డెవలప్ మెంట్ కోసం బయోటెక్నాలజీ డిపార్ట్ మెంట్ 100 కోట్ల సాయం చేసింది.

ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ నిల్వలు అయిపోతున్నాయి. దీంతో కేంద్ర వ్యాక్సిన్ పాలసీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని కంపెనీలకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో కేంద్రంలో కదలిక వచ్చింది. ఫ్రెండ్ షిప్ ప్రోగ్రాంలో భాగంగా విదేశాలకు పంపుతున్న డోసులను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది.

ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్, కొవీషీల్డ్ అందుబాటులో ఉన్నాయి. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఇటీవలే భారత్ చేరుకుంది. వీటితో పాటు.. ఫైజర్, మొడెర్నా సంస్థల వ్యాక్సిన్లు కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీలతో చర్చలు కొనసాగిస్తోంది.

Read Also :

ఈ లేడీ సింగం శారదా రౌత్ గురించి మీకు తెలుసా..?

సంజయన్న కమాల్ హై.. జబర్దస్త్ ప్లాన్ ఏసిండు..!

టీవీ9కు ఎందుకీ గులగుల..? ప్రతీదాన్ని ఎందుకు కెలుకుతుంది..?

రెచ్చిపోయిన దివి పాప.. ఏం ఉంది నా సామిరంగా

కరోనా చావులకు అసలు కారణాలేంటి..?

ఈటల రాజేందర్... రెడ్డి..? బీసీ..? కన్ఫ్యూజన్ కథలు..!

అనసూయ అందాలు అదరహో..!

ఇమ్యూనిటీ పెంచే మల్లెపూల ఛాయ్..!

తిన్నది అరగడం లేదా..? అయితే ఇలా చేయండి..!

తెలంగాణ బీజేపీ మాస్టర్ ప్లాన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

పత్తిత్తు మీడియా ప్రవచనాలు.. అందరూ ఆ బాపతే..!! 

అబ్బాయిలకి ఫుల్ క్రష్ గా మారిన 30 weds 21అమ్మాయి..!