Facebook going to change its name : ప్రస్తుతం చాలామందికి పొద్దున లేచిన దగ్గర్నుంచి.. రాత్రి పడుకునే వరకు ఫేస్ బుక్ చూడకుంటే మనసు మనసులో ఉండదు.
లైకులు, కామెంట్లు, షేర్లలో టైం పాస్ చేస్తుంటారు. అంతలా మనతో మమేకమైపోయింది ఫేస్ బుక్. ఫేస్ బుక్ అనే ఆ పేరే ఓ సంచలనంగా మారింది.
సోషల్ మీడియా చరిత్రలో ఫేస్ బుక్ ఓ విప్లవం సృష్టించింది. అత్యధికంగా యూజర్లను సొంతం చేసుకుంది. కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది.
అయితే.. ఫేస్ బుక్ సంస్థ త్వరలో తమ యూజర్లకు ఓ బ్రేకింగ్ న్యూస్ చెప్పబోతోందట.
అదేంటంటే… త్వరలోనే ఫేస్ బుక్ పేరు మార్చబోతున్నారట. ఫేస్ బుక్ కు మరోపేరు పెట్టేందుకు రెడీ అయ్యారట. ఆల్రెడీ పేరు కూడా డిసైట్ చేశారట. అఫీషియల్ గా అనౌన్స్ చేయడమే మిగిలి ఉందని అంటున్నారు.
ఈ నెల 28న ఫేస్ బుక్ సంస్థ జనరల్ బాడీ మీటింగ్ ఉంది. ఈ మీటింగ్ లోనే పేరు ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. దాని కంటే ముందే.. రెండు మూడు రోజుల్లో ఫేస్ బుక్ కొత్త పేరుపై ప్రకటన రానుందని సమాచారం.
అయితే.. ఇటీవల ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. తాను ఉన్నా లేకున్నా సంస్థ అభివృద్ధి కొనసాగాలంటూ ఆయన కామెంట్ చేశారు. అంటే త్వరలో ఫేస్ బుక్ నుంచి మార్క్ జుకర్ బర్గ్ తప్పుకోబుతున్నారా..? అనే ప్రశ్న కూడా మొదలైంది.
టెక్ట్స్ బుక్ ను సైతం మరిపించేలా ఫేస్ బుక్ పేరుతో ప్రపంచాన్ని ఊర్రూతలూగిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ ఫాంకు కొత్తగా ఏ పేరు పెడతారో..?
Read Also :
- Yakshini : ఎవరీ యక్షిణి..? మగాళ్లను ఎందుకు చంపుతోంది..?
- KTR : జై శ్రీరామ్, జై మోడీ అని ఈటల ఎందుకు అనడం లేదు : కేటీఆర్
- హుజురాబాద్ లో దళితబంధు ఆగిపోవడానికి అసలు కారణం ఎవరంటే?
- కోటా… నీ పని నువ్వు చూసుకో.. అభిప్రాయాలు చెప్పడం మానుకో..! అనసూయ గరంగరం..!
- Surekha Vani second marriage : సురేఖవాణి రెండో పెళ్లి చేసుకుందా.. ? తాళిబొట్టుతో వాటమ్మా.. !
- Huzurabad bye election :ఢిల్లీ టూ హుజురాబాద్.. చక్రం ఎక్కడ తిరిగింది.?
- Air turbine fuel : మీరు ఎంత రిచ్చో తెలుసా..?
- నిద్రపోతున్న భర్త పురుషాంగంపై వేడి నీళ్లు పోసిన మూడో భార్య.. చావు కేకలతో ఆసుపత్రిలో..!
- పెళ్లి సందడి హీరోయిన్ కి బిగ్ షాక్… ‘శ్రీలీల’ తన కూతురు కాదంటూ కోర్టులో కేసు.. !