home page

నా మనసు అప్పుడే విరిగిపోయింది:ఈటల

కేసీఆర్ ఇప్పుడు డబ్బు మనిషి అయ్యాడన్న ఈటల
 | 
eatela rajender resigned to trs and mla post

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీలో తీవ్రమైన అవమానాలు ఎదురుకావడంతోనే పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు చెప్పారు.

మంత్రిగా ఉన్న తనను మూడు సార్లు అవమానించారని చెప్పారు. అపాయింట్ మెంట్ తీసుకుని ప్రగతిభవన్ కు వెళ్లినా.. గేటు లోపలికి రానివ్వలేదన్నారు ఈటల. అది ప్రగతి భవన్ కాదని.. బానిసనల నిలయమని కామెంట్ చేశారు.

కేసీఆర్ కు మందులిచ్చే వ్యక్తికి ఎంపీ పదవి ఇచ్చారని. ఆయన చేతుల మీదుగా నడుస్తోందన్నారు. ఉద్యమంలో కొట్లాడిన వారిని ఏనాడూ పట్టించుకోవడం లేదన్నారు.

ఉద్యమ సమయంలో ఏర్పడిన  సంఘాలన్నింటిని ఇప్పుడు కవిత చేతుల్లో పెట్టాలని చూస్తున్నారన్నారు ఈటల. సింగరేణి మీద ఏ అవగాహన లేకున్నా కవితకు సింగరేణి బాధ్యతలు ఇచ్చారన్నారు. ఆర్టీసీ, విద్యుత్ సంఘాలను కూడా కవిత పెత్తనం ఉండాలని చూస్తున్నారన్నారు.

లాలూ ప్రసాద్, మాయావతి, జయలలిత లాగా పుట్టిన పార్టీ కాదు. తెలంగాణ ఉద్యమం కోసం ప్రజలు కలిస్తే పుట్టిన పార్టీ.

ప్రభుత్వ పథకాలను తాను ఏనాడూ వ్యతిరేకించలేదన్నారు ఈటల. రైతు బంధు పేద రైతులకే ఇవ్వాలన్నందుకు తనపై కక్షగట్టారన్నారు. పెన్షన్లు ఆపేయడం సరికాదని చెప్పానన్నారు. ధాన్యం కొనబోమని సర్కారు చెబితే.. ఐకేపీ సెంటర్లు ఉంటాయని తాను అన్నానని.. దానికి తనపైనే కక్షగట్టారన్నారు.

ఎలాగైనా తనను బొందపెట్టాలని రాజుగారి ఆదేశాలు వచ్చాయని.. అందుకే ఇదంతా చేస్తున్నానన్నారు. ఉద్యమంలో పోరాటాన్ని నమ్ముకున్న కేసీఆర్.. ఇప్పుడు డబ్బును నమ్ముకున్నారని ఆరోపించారు.

Read Also :

ఈ లేడీ సింగం శారదా రౌత్ గురించి మీకు తెలుసా..?

సంజయన్న కమాల్ హై.. జబర్దస్త్ ప్లాన్ ఏసిండు..!

టీవీ9కు ఎందుకీ గులగుల..? ప్రతీదాన్ని ఎందుకు కెలుకుతుంది..?

రెచ్చిపోయిన దివి పాప.. ఏం ఉంది నా సామిరంగా

కరోనా చావులకు అసలు కారణాలేంటి..?

ఈటల రాజేందర్... రెడ్డి..? బీసీ..? కన్ఫ్యూజన్ కథలు..!

అనసూయ అందాలు అదరహో..!

ఇమ్యూనిటీ పెంచే మల్లెపూల ఛాయ్..!

తిన్నది అరగడం లేదా..? అయితే ఇలా చేయండి..!

తెలంగాణ బీజేపీ మాస్టర్ ప్లాన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

పత్తిత్తు మీడియా ప్రవచనాలు.. అందరూ ఆ బాపతే..!! 

అబ్బాయిలకి ఫుల్ క్రష్ గా మారిన 30 weds 21అమ్మాయి..!