కేసులు పెరుగుతున్నాయ్.. లైట్ తీసుకుంటే ఖతమే..!
Latest National News

కేసులు పెరుగుతున్నాయ్.. లైట్ తీసుకుంటే ఖతమే..!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ ఈ నెలలోనే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ చాలా మంది కరోనాని లైట్ తీసుకుంటున్నారు. ఇలాగే అయితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అంటున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 21,24,953 కరోనా పరీక్షలు చేయగా 41,195 కొత్త కేసులు బయటపడ్డాయి.

తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య 48,73,70,196కి చేరింది. అటు వైరస్ బారిన పడి మరో 490 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఆ సంఖ్య 4,29,669కి చేరింది. కాగా ప్రస్తుతం దేశంలో 3,87,987 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. మాస్క్ లు ధరించకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా వ్యవహరిస్తే ఈ కేసులు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ మాస్క్ లు కంపల్సరీ అంటున్నారు వైద్యులు.

Also Read :