home page

ఈటల రాజేందర్... రెడ్డి..? బీసీ..? కన్ఫ్యూజన్ కథలు..!

ఈటల సామాజిక వర్గంపై కన్ఫ్యూజన్
 | 
confusion over telangana ex health minister eatela rajender cast

- ఈటల వైపు కన్నెత్తి చూడని బీసీ నేతలు

- ముందు నుంచి ఈటలతోనే రెడ్డి నేతలు

- బీసీ నేతలను టీఆర్ఎస్ కంట్రోల్ లో పెట్టిందా..?

తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ చర్చనీయాంశంగా మారారు. త్వరలో ఆయన బీజేపీలో చేరబోతున్నారన్న వార్తలు మీడియాలో మార్మోగుతున్నాయి. బీజేపీలో చేరికపై ఈటల క్లారిటీ ఇవ్వకపోయినా.. బీజేపీ వర్గాలు మాత్రం కన్ఫామ్ అంటున్నాయి.

ఇవన్నీ పక్కన పెడితే.. ఇప్పుడు మరో ఆసక్తికర అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నిజానికి ఈటల రాజేందర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన భార్యది రెడ్డి సామాజిక వర్గం. ఇటీవల ఈటల రాజేందర్ కొడుకు పేరుతో ఓ ల్యాండ్ డాక్యుమెంట్ బయటకు వచ్చింది. అందులో ఈటల రాజేందర్ తో పాటు ఆయన కొడుకు పేరు చివరన రెడ్డి అని ఉంది.

మంత్రి పదవి నుంచి ఉధ్వాసనకు గురైన ఈటల రాజేందర్.. తాను బీసీనని.. అందుకే తనపై కుట్ర చేశారని చెప్పుకుంటున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఏ చిన్న అవకాశం దొరికినా.. తాను బీసీ బిడ్డనని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇంత వరకు బాగానే ఉంది. కానీ.. ఇంత జరిగినా.. ఇప్పుడు ఈటల రాజేందర్ రెడ్డి..? ఈటల రాజేందర్ ముదిరాజ్..? అనే దానిపై కన్ప్యూజన్ కొనసాగుతూనే ఉంది.

ఎందుకంటే.. బీసీ నేతగా చెప్పుకుంటున్న ఈటలకు మద్దతిచ్చే వారిలో ఎంతమంది బీసీ నేతలున్నారనేది ఇప్పుడు అసలు సమస్య. ముదిరాజ్ సంఘాలు తప్ప.. బీసీల్లోని ఇతర కులాలకు చెందిన లీడర్లు ఎంతమంది ఈటలకు మద్దతు తెలిపారనేది ఇప్పటికీ తెలియడం లేదు.

కానీ ఈటల రాజేందర్ మాత్రం మొదటి నుంచి ఇతర పార్టీల్లోని రెడ్డి సామాజిక వర్గ నేతలతో టచ్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి నేతలు చాలా కాలంగా ఈటలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఇప్పుడు కొత్తగా తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరామిరెడ్డి కూడా ఈటలకు మద్దతిచ్చారు.

వీరితో పాటు.. ఇతర పార్టీల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు.. ఎప్పటికప్పుడు ఈటలతో మాట్లాడుతూనే ఉన్నారట. కానీ బీసీ నేతలు మాత్రం పెద్దగా ఈటలకు ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదనే మాట వినిపిస్తోంది.

అయితే... బీసీ నేతలు ఈటలను కలవకపోవడంలో టీఆర్ఎస్ పార్టీ పాత్ర కూడా ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. హుజురాబాద్ లో ఈటలకు చెక్ పెట్టాలని చూస్తున్న టీఆర్ఎస్.. నియోజకవర్గంతో పాటు.. బయట ఉన్న బీసీ నేతలను కూడా తమ కంట్రోల్ లోకి తెచ్చేసుకుందనే విమర్శలున్నాయి. 

Read Also :

అనసూయ అందాలు అదరహో..!

ఇమ్యూనిటీ పెంచే మల్లెపూల ఛాయ్..!

తిన్నది అరగడం లేదా..? అయితే ఇలా చేయండి..!

తెలంగాణ బీజేపీ మాస్టర్ ప్లాన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాందేవ్ బాబాపై దేశద్రోహం కేసు..! పెద్ద షాకిచ్చిన IMA..!

పత్తిత్తు మీడియా ప్రవచనాలు.. అందరూ ఆ బాపతే..!! 

అబ్బాయిలకి ఫుల్ క్రష్ గా మారిన 30 weds 21అమ్మాయి..! 

తెల్ల చీర.. తెల్లతోలు.. అబ్బబ్బా.. ఏమి అందం.. 

అందాల దివి... ఒక్కో ఫోటో అరాచకం..!