home page

Sharda Raut : ఈ లేడీ సింగం శారదా రౌత్ గురించి మీకు తెలుసా..?

చోక్సీని భారత్ తీసుకొచ్చే టీంకు చీఫ్ శారదా రౌత్
 | 
cbi officer sharda raut

చాలా మంది సింగం 2 సినిమా చూసే ఉంటారు. మూణ్ణాలుగు భాషల్లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ చాలామందికి హాట్ ఫేవరేట్. డ్రగ్ ముఠాల పనిపట్టేందుకు సూర్య చేసే ఆపరేషన్ డీ.. కి ఫిదా కాని వారు లేరు. ఇండియా నుంచి ఆఫ్రికా వెళ్లడం.. డ్రగ్ దందాలో కీలకంగా ఉన్న డానీని అరెస్ట్ చేయడం.. భారత్ కు తీసుకురావడం.. ఆ క్లైమాక్స్ చూస్తే రోమాలు నిక్కపొడుతున్నాయి.

కానీ అదంతా సినిమా. నిజ జీవితంలో ఇలాంటివి జరిగే చాన్సే లేదని అనుకుంటున్నారా.?

కానీ.. ఉంది.. ఆ ఛాన్స్ నూటికి నూరు శాతం ఉంది.

ప్రస్తుతం అలాంటి ఓ ఆపరేషనే జరుగుతోంది. అదే ఆపరేషన్ M. అంటే ఆపరేషన్ మెహుల్ చోక్సీ. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో ఒక నిందితుడు.. ప్రధాని నిందితుడైన నీరవ్ మోడీకి సన్నిహితుడు.

13,500 కోట్ల స్కాంలో నిందితుడిగా ఉన్న మెహుల్ చోక్సీని తీసుకొచ్చేందుకు ఓ సింగం డొమినికా వెళ్లారు. ఆమెనె లేడీ సింగం శారదా రౌత్.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను ఎంక్వైరీ చేస్తున్న అధికారి శారదా రౌత్. సీబీఐ ముంబై విభాగంలో బ్యాంకింగ్ ఫ్రాడ్ విభాగానికి ఆమె చీఫ్ గా ఉన్నారు. మరో ఆరుగురు అధికారులతో కలిసి చోక్సీని భారత్ తీసుకొచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్ లో డొమికినా వెళ్లారు. అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

శారదా రౌత్ మామూలు అధికారి కాదు. సర్వీస్ లో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి పేరు తెచ్చుకున్నారు. 2005 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ కు చెందిన ఐఎస్ అధికారి. మహారాష్ట్రలోని నాసిక్ లో జన్మించారు. ఐపీఎస్ గా శిక్షణ పూర్తి చేసుకున్నాక పాల్ ఘర్ జిల్లా ఎస్పీగా మొదట బాధ్యతలు స్వీకరించారు. తర్వాత చాలా జిల్లాల్లో ఆమె విధులు నిర్వర్తించారు. పని చేసిన ప్రతీ చోట ఆమెకు మంచి పేరు వచ్చింది.

తర్వాత పోలీసు శాఖ నుంచి సీబీఐలోకి వచ్చారు. అక్రమార్కుల ఆటకట్టిస్తూ వారి గుండెల్లో నిద్రపోతున్నారు ఈ లేడీ సింగం శారదా రౌత్. ఇప్పుడు ఆర్థిక నేరగాడు చోక్సీని భారత్ పట్టుకొచ్చే ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.

Read Also :

సంజయన్న కమాల్ హై.. జబర్దస్త్ ప్లాన్ ఏసిండు..!

టీవీ9కు ఎందుకీ గులగుల..? ప్రతీదాన్ని ఎందుకు కెలుకుతుంది..?

రెచ్చిపోయిన దివి పాప.. ఏం ఉంది నా సామిరంగా

కరోనా చావులకు అసలు కారణాలేంటి..?

ఈటల రాజేందర్... రెడ్డి..? బీసీ..? కన్ఫ్యూజన్ కథలు..!

అనసూయ అందాలు అదరహో..!

ఇమ్యూనిటీ పెంచే మల్లెపూల ఛాయ్..!

తిన్నది అరగడం లేదా..? అయితే ఇలా చేయండి..!

తెలంగాణ బీజేపీ మాస్టర్ ప్లాన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

పత్తిత్తు మీడియా ప్రవచనాలు.. అందరూ ఆ బాపతే..!! 

అబ్బాయిలకి ఫుల్ క్రష్ గా మారిన 30 weds 21అమ్మాయి..!