Dasoju Sravan : నచ్చితే ఒక పార్టీ, నచ్చకపోతే మరో పార్టీ
Latest News Telangana

Dasoju Sravan : నచ్చితే ఒక పార్టీ, నచ్చకపోతే మరో పార్టీ

Dasoju Sravan :  ప్రజారాజ్యం పార్టీతో క్రియాశీలక రాజకీయల్లోకి వచ్చిన దాసోజ్ శ్రవణ్ (Dasoju Sravan) కొద్దీ రోజుల్లోనే మంచి రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అ సమయంలోనే పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా ఉండి సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి పీఆర్పీ అభ్యర్థిగా 91 వేల ఓట్లు తెచ్చుకున్నాడు.

తరువాత మారిన రాజకీయ సమీకరణాల్లో ఉద్యమ పార్టీ అయినా తెరాసలో చేరారు. అతి కొద్దీ కాలంలోనే ఆయన కేసీఆర్, కేటీఆర్ లకు సన్నిహితుడుగా మారారు. భువనగిరి నుండి తెరాస పార్టీ నుండి ఎంపీ టికెట్ ఆశించిన ఆయనకు టికెట్ దక్కకపోవడంతో అ పార్టీని వీడారు.

తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశీస్సులు పొందాడు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఖైరతాబాద్ లో పోటీ చేసిన అయన ఓటమి పాలయ్యారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల ఖైరతాబాద్ కు చెందిన మాజీ పీజేఆర్ కూతురు విజయ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

దీంతో మళ్ళీ మస్తాపానికి గురైనశ్రవణ్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీని వీడి తెరాస పార్టీలోనే చేరారు.

Dasoju Sravan

Credit

Srinivas Journalist

Also Read :