Huzurabad by-election : తెలంగాణలో ఇప్పుడు మోస్ట్ హాట్ టాపిక్ హుజురాబాద్ బై ఎలక్షన్స్. పేరుకే బై ఎలక్షన్స్ అన్నమాట కానీ.. కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ గా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ ఈ బై ఎలక్షన్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఎలా అయినా ఈటల రాజేందర్ ను అక్కడ ఓడించి సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఆత్మగౌరవం పేరుతో టీఆర్ఎస్ పతనానికి ఈ ఎన్నికతో పునాది వేయాలని బీజేపీ ఆశిస్తోంది.
మొత్తానికి ఈ టఫ్ ఫైట్ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ ఉపఎన్నికకి మొత్తం 61మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
అయితే హుజూరాబాద్‌లో రాజేందర్ పేరుతో మొత్తం నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు..ఇందులో ముగ్గురు చివరి రోజున నామినేషన్లు వేశారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే వీరి ఇన్షియల్ కూడా E తోనే మొదలవుతుంది. వాళ్ళే ఇమ్మడి రాజేందర్, ఈసంపల్లి రాజేందర్, ఇప్పలపల్లి రాజేందర్.
ఓటర్లను పక్కా గందరగోళానికి గురిచేసేందుకే టీఆర్ఎస్ ఈ పనికి పూనుకుందని బీజేపీ ఆరోపిస్తోంది. కాగా ఈ నెల 30న హుజురాబాద్ ఉప ఎన్నిక జరగనుంది.
Read Also :
- పేటీఎం బంపర్ ఆఫర్.. సిలిండర్ బుక్ చేస్తే 10,000..!
- Cat missing : పిల్లి కోసం తిండి బంద్.. బడి బంద్..! ఎక్కడంటే…?
- Praneeta Patnaik : NETమూవీ పల్లెటూరి పిల్ల ఒరిజినల్ గెటప్ చూస్తే కళ్లు జిగేల్..!
- Air india : పాత విమానానికే కొత్తగా రెక్కలొచ్చాయి..! వెల్కం చెప్పిన టాటా
- Samantha : ఇక అన్నీ మూసుకోండి.. సమంత దిమ్మదిరిగే కౌంటర్..!
- Sravanthi : రోజు రోజుకు డోస్ పెంచుతున్న హాట్ యాంకర్
- Anasuya : బాప్ రే.. ఈ ఏజ్ తో కూడా ఏం అందం.. ఏం అందం..!
- Petrol : ఓ సారి పెట్రోల్ ట్యాంక్ చెక్ చేసుకోండి.. లేకుంటే అంతే..!