Latest News Telangana

హుజురాబాద్ లో దళితబంధు ఆగిపోవడానికి అసలు కారణం ఎవరంటే?

టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం దళితబంధు.. ఇప్పుడు ఈ పథకానికి బ్రేక్ పడింది. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో దళిత బంధు అమలును నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఓటర్లు ప్రలోభానికి లోనుకాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. అయితే దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటంటే.. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ.. జూలైలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి ఓ లేఖ రాసింది. అందులో కేవలం హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని కంప్లైంట్ చేసింది.

దీని పైన స్టేట్ ఎలక్షన్ కమిషన్.. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి ఈ నెల 8 న లేఖ రాసింది. దీనితో కేంద్ర ఎన్నికల సంఘం దళిత బంధు పథకానికి హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల అనంతరం యధావిధిగా ఈ పథకాన్ని కొనసాగించవచ్చని తెలిపింది.