home page

సంజయన్న కమాల్ హై.. జబర్దస్త్ ప్లాన్ ఏసిండు..!

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్
 | 
bandi sanjay warning to telangana cm kcr

- వచ్చే ఎన్నికల్లోపు కేసీఆర్ ఝలక్ ఇస్తారా..?

- పాత కేసులు తిరగతోడి కేసీఆర్ ను ఇరకాటంలో పెడతారా..?

- సంజయ్ హెచ్చరికల్లో మర్మమేంటీ..?

బీజేపీలోకి ఈటల.. జైలుకు కేసీఆర్..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు ఉంది. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత వరుసగా రెండుసార్లు టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారి జరగబోయేవి తెలంగాణ అసెంబ్లీకి మూడోసారి జరుగుతున్న ఎన్నికలు.

ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచి నిలిచేది తామేనని కేసీఆర్ చెబుతున్నారు. కానీ కేసీఆర్ పని అయిపోయిందని.. టీఆర్ఎస్ పార్టీ గెలిచే ఛాన్సే లేదని అంటోంది బీజేపీ. దీనికి తగ్గట్టుగానే ప్రణాళికలు కూడా రచిస్తోంది. ఇష్యూ ఏదైనా.. అవకాశం దొరికిన ప్రతీసారీ హడావుడి చేసి తమ ఉనినికి మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లోనే బీజేపీకి దొరికిన మరో అస్త్రం ఈటల రాజేందర్. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి. ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన వ్యక్తి.. కేసీఆర్ తో అన్నా, తమ్ముడు అనేంత సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్

తెలంగాణ ఏర్పాటు కంటే ముందు నుంచి ఈటల రాజేందర్, కేసీఆర్ కలిసే పనిచేస్తున్నారు. పార్టీ పెట్టాక, ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆయన సముచిత స్థానమే ఇచ్చారు. కానీ ఎక్కడో తేడా కొట్టింది. ఈటలను పార్టీ నుంచి పొమ్మని డైరెక్ట్ గా చెప్పలేక.. పొగబెట్టారు. దీంతో తట్టా బుట్టా సర్దేసుకుని వెళ్లిపోయారు ఈటల. ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో బీజేపీ కండువా కూడా కప్పేసుకుంటారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కన్ఫామ్ చేశారు.

ఈటల రాజేందర్ బీజేపీలో చేరితే.. ఆ పార్టీకి చాలా మైలేజ్ వచ్చినట్టే లెక్క. రాబోయే ఎన్నికల్లో ఇది చాలా ప్లస్ అవుతుంది. ఉద్యమకారుడు, బీసీ నాయకుడు, సౌమ్యుడు.. ఇవన్నీ కలిసివచ్చే అంశాలే.

ఒక్క ఈటల రాజేందర్, ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీలో చేరినంత మాత్రాన.. ఆ పార్టీ ఎన్నికల్లో గెలిస్తుందని చెప్పలేం. మనకంటే బలవంతుడిని కొట్టాలంటే.. మన బలం పెంచుకోవడంతో పాటు.. ఎదుటి వాటి బలహీనతలపైనా కొట్టాలి. ఇదే రాజకీయ మూల సూత్రం.

ఇప్పుడు బీజేపీ అదే పనిచేస్తోంది. కేసీఆర్ పై ఉన్న పాత కేసుల్ని తిరగతోడుతోంది(బీజేపీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా అక్కడ అధికారంలో ఉన్నవారి కేసుల్ని తిరగతోడటం ఆనవాయితీ). అప్పుడెప్పుడో జరిగిన సహారా కేసు నుంచి.. మొన్నటికి మొన్న జరిగిన ప్రాజెక్టుల నిర్మాణం వరకు ప్రతీ దాంట్లో ఎంతెంత దోపిడీ చేశారో.. లెక్కలు తీస్తున్నామని చెబుతున్నారు బండి సంజయ్.

కేసుల చిట్టా మొత్తం చేతులో పట్టుకుంటే.. ఆటోమెటిక్ గా కేసీఆర్ కూడా కాస్త తగ్గుతారు(బీజేపీ విషయంలో కేసీఆర్ ఆల్రెడీ చాలా తగ్గారు).  అదే ఎన్నికల టైం అయితే.. ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లితే కేసీఆర్ కు ఎదురుదెబ్బలు తగలడం ఖాయం. తమకు టీఆర్ఎస్ లో తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే ఆందోళనతో ఉన్న చాలామంది గోడదూకేందుకు రెడీ అవుతున్నారట.

ఇక.. సరిగ్గా ఎన్నికల టైంలో సీఎంపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయంటే.. మరుక్షణమే మెడపై కండువా మార్చేస్తారు. మోడీకే జై అంటూ తల ఊపేస్తారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కూడా అదే ధీమాతో ఉన్నట్టున్నారు. అందుకే ఏకంగా కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని అనౌన్స్ మెంట్లు చేస్తున్నారు.

చూడాలి మరి తెలంగాణ రసవత్తర రాజకీయం ఎంత వరకు వెళ్తుందో..? ఈటల కండువా మార్చడం వరకే ఆగుతుందా..? లేకపోతే కేసీఆర్ కాస్ట్యూమ్ మార్చే వరకు తీసుకెళ్తుందా..?

లెట్స్ వెయిట్ అండ్ సీ....

Read Also :

టీవీ9కు ఎందుకీ గులగుల..? ప్రతీదాన్ని ఎందుకు కెలుకుతుంది..?

రెచ్చిపోయిన దివి పాప.. ఏం ఉంది నా సామిరంగా

కరోనా చావులకు అసలు కారణాలేంటి..?

ఈటల రాజేందర్... రెడ్డి..? బీసీ..? కన్ఫ్యూజన్ కథలు..!

అనసూయ అందాలు అదరహో..!

ఇమ్యూనిటీ పెంచే మల్లెపూల ఛాయ్..!

తిన్నది అరగడం లేదా..? అయితే ఇలా చేయండి..!

తెలంగాణ బీజేపీ మాస్టర్ ప్లాన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

పత్తిత్తు మీడియా ప్రవచనాలు.. అందరూ ఆ బాపతే..!! 

అబ్బాయిలకి ఫుల్ క్రష్ గా మారిన 30 weds 21అమ్మాయి..!