Guntur Ramya murder:హంతకుడు అతడే.. రమ్య మర్డర్ కు 8 నిమిషాల ముందు..!
Andhra Pradesh News Off Beat

Guntur Ramya murder:హంతకుడు అతడే.. రమ్య మర్డర్ కు 8 నిమిషాల ముందు..!

AP police investigation on Guntur Ramya murder case : ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిరోడ్డుపై నడిచినప్పుడు  దేశానికి అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్టని ఆ రోజు గాంధీ గారు అన్నారు.. కానీ ఇప్పుడు రాత్రి కాదు కదా.. పట్టపగలు అందరిముందు అడది నడవాలంటే కూడా భయంగానే ఉంది. స్వాతంత్ర దినోత్సవం రోజున గుంటూరు జిల్లాలో రమ్య అనే యువతి పైన గుర్తు తెలియని ఓ యువకుడు కత్తితో పొడిచి పరారైన సంగతి తెలిసిందే.

ఏపీలోనే కాదు తెలుగు స్టేట్స్ లోనూ ఇప్పుడు ఇది పెద్ద హాట్ టాపిక్.. ఎవరా దుండగుడు అసలు ఎందుకు చంపాడని కనుకునే పనిలో పడ్డారు పోలీసులు.. ఓ ప్రైవేట్‌ కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతుంది రమ్య.. ఈ రోజు కాకాణి రోడ్డు వైపు  వెళుతుండగా అటుగా వచ్చి ఓ యువకుడు తన బైక్‌పై ఎక్కాలని రమ్యను కోరాడు.

అందుకు రమ్య(Guntur Ramya murder) నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను మెడ, పొట్ట భాగంలో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు.

AP police investigation on GunturRamya murder case 1

వెంటనే రమ్యను గుంటూరులోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు స్థానికులు.. అయితే అప్పటికే రమ్య చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. న్యూస్ అప్పటికే మీడియాలో రచ్చ రచ్చ అవుతుండడంతో పోలీసులు ఈ కేసును ఓ సవాల్ గా తీసుకున్నారు.

రమ్య హత్య కేసులో శశికృష్ణ అనే యువకుడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య జరిగే ముందు 8 నిమిషాల పాటు రమ్యతో శశికృష్ణ వాగ్వాదానికి దిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.

రమ్య సోదరి మౌనిక నుంచి పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. రమ్య ఫోన్ లాక్ ఓపెన్ అయితే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం శశికృష్ణని వెతికే పనిలో ఉన్నారు పోలీసులు.. నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుడు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

కాగా రమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి సుచరిత అన్నారు. నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని అన్నారు.