YS JAGAN in troubles : జగన్ కి మరో షాక్.. ఇప్పుడెలా..?
Andhra Pradesh Latest

YS JAGAN in troubles : జగన్ కి మరో షాక్.. ఇప్పుడెలా..?

YS JAGAN in troubles as cabinet reshuffle: కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఇప్పుడు అధికార వైసీపీలో చిచ్చు రేపింది. మంత్రి పదవులు వస్తాయని ఆశించి భంగపడ్డ పలువురు ఎమ్మెల్యేలు బాహటంగానే అధిష్టానంపై ఆగ్రహం, అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన తల్లి ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేశారని, పార్టీకి కాదని సుచరిత కూతురు రిషిత స్పష్టం చేశారు.

sucharithaa
మాజీ మంత్రి సుచరిత

Read Also :

గత క్యాబినెట్ లో ఎస్సీ సామజిక మంత్రులందరిని(YS JAGAN in troubles) కొనసాగించి కేవలం తనని మాత్రం పక్కన పెట్టడం పట్ల సుచరిత ఆవేదనకీ లోనయ్యారని, ఈ క్రమంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది.

ఇక అదే బాటలో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆయనని బుజ్జగించేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లారు. మరి బుజ్జగింపులకి ఆయన లొంగుతారా లేదా పార్టీ పైన దిక్కర స్వరం వినిపిస్తారా అన్నది చూడాలి.

balineni srinivas reddy
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి

అటు బాలినేనిని మంత్రి పదవిలో కొనసాగించకపోవడంతో(YS JAGAN in troubles)ఇంకొల్లు జడ్పీటీసీ సభ్యురాలు భవనం శ్రీ లక్ష్మి తన పదవికి రాజీనామా చేశారు. ఓఎంసీ మేయర్ గంగాడ సుజాత, కౌన్సిలర్లు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Read Also :