Sarpanch vijaya:ఆ సర్పంచ్ కు నిబంధనలు వర్తించవా..?
Andhra Pradesh

Sarpanch vijaya:ఆ సర్పంచ్ కు నిబంధనలు వర్తించవా..?

Sarpanch vijaya baby : ఆ గ్రామ సర్పంచ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది. నిబంధనలను తుంగలో తొక్కటం ఆమెకు అలవాటుగా మారింది. గుంటూరు జిల్లా రేపల్లె మండలం ఉప్పూడి గ్రామ సర్పంచ్ గుజ్జర్లమూడి విజయాబేబీ తీరు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వివాదాస్పదంగా మారింది.

స్వాతంత్ర్య దినోత్సవం రోజు గ్రామ సర్పంచ్ లతో కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా కమిటీ ఛైర్మన్‌లతో జాతీయ జెండా ఎగురవేయించాలని ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.‌ అయితే ఏపీ ప్రభుత్వ ఆదేశాలను పక్కనపెట్టి ఉప్పూడి ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ విజయాబేబీ జాతీయ జండా ఎగురవేయటం‌ కొసమెరుపు. దీంతో సర్పంచ్ విజయాబేబీ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ముగ్గురు సంతానం ఉన్న నేపథ్యంలో సర్పంచ్ గా విజయాబేబీ ఎన్నిక చెల్లదని ఇప్పటికే రేపల్లె సీనియర్ సివిల్  కోర్టులో పిటిషన్ ధాఖలైంది. తాజా ఘటనతో మరోసారి ఉప్పూడి సర్పంచ్ తీరు చర్చనీయాంశంగా మారింది.‌

ఈ ఘటనపై రేపల్లె మండల ఎంఈఓ నవీన్ కుమార్ ను వివరణ కోరగా .. మండలంలోని అన్ని పాఠశాలల్లో విద్యా కమిటీ ఛైర్మన్ లతోనే జెండా ఎగురవేయించామని సెలవిచ్చారు .

Read Also: