Two ladies married in prakasham district : హైటెక్ యుగంలో అన్నీ చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. లింగభేదం లేకుండా పెళ్లిళ్లు కామన్ అయిపోయాయి. అమ్మాయిలతో అమ్మాయిలు, అబ్బాయిలతో అబ్బాయిల పెళ్లిళ్లు సర్వసాధారణం అయ్యాయి. ఇలాంటి చాలా ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో జరిగింది.
ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఇద్దరు యువతులు పెళ్లి చేసుకున్నారు. 19 ఏళ్ల రమ్య, 32 ఏళ్ల సుమలత ప్రేమించుకున్నారు. రమ్యది అమరావతి నగర్, సుమలతది జాలిపాలెం. కొత్తపట్నం బీచ్ దగ్గర ఇద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. ఈ ఏడాది జనవరి 14న ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. రంగుతోటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు.
Read Also
ఇద్దరు యువతులు పెళ్లి చేసుకోవడంపై వారి తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో గొడవ కాస్తా పోలీస్ స్టేషన్ కు చేరింది. దీంతో పోలీసులు వారిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయినా వారి మనసు మారలేదు. ఒకరిని విడిచి ఒకరం ఉండలేమంటున్నారు. వేరే యువకుడితో పెళ్లి చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు.
అయితే.. ఈ కేసు విచారణ చేపట్టి పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. సుమలత అనే యువతి గతంలోనే ఓ సారి జైలుకు వెళ్లి వచ్చింది. యువతులపై లైంగికదాడి చేసులో సుమలత జైలుకు వెళ్లి వచ్చింది. సుమలత గదిలో పురుషుల విగ్గు, ఇతర సామగ్రి కూడా దొరికాయి. సుమలతకు గతంలోనే ఓ యువకుడితో పెళ్లి అయ్యింది, కానీ ఆమె వ్యవహారం తెలియగానే భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇప్పుడు ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంది సుమలత.
దీంతో సుమలత అసలు కథ ఏంటనే దానిపై ఫోకస్ పెట్టారు పోలీసులు. గతంలో ఏం చేసేది..? ఆమె మెంటల్ కండీషన్ ఏంటనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నారు.
Read Also :
- Revanth Reddy : బండికి ఉన్నంత ఇంగిత జ్ఞానం నీకు లేకపాయె రేవంత్.. ఛీఛీ..!
- Rahul Ramakrishna : నీ అంత ఏర్రీనా కొడుకుని నేను ఇంతవరకు చూడలేదు బ్రో..!
- RJ Kajal : ఇజ్జత్ పికింది.. యాంకరింగ్ రాదు.. మళ్ళీ కవరింగ్ ఒకటి..!