Tirumala : తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ
Andhra Pradesh Latest News

Tirumala : తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఆదివారం 70,373 మంది శ్రీవారిని(Tirumala ) దర్శించుకున్నారు. 32,954 మంది భక్తులు .తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 5.05 కోట్లు వచ్చినట్టుగా ఆలయ అధికారులు వెల్లడించారు.

ఆదివారం తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. ఉదయం నుంచి రాత్రివరకు చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. దీంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. శ్రీవారి ఆలయం మొదలుకొని మాడవీధులు, కాటేజీలు, బస్టాండ్‌, రోడ్లు, పార్కులు వంటి ప్రాంతాలన్నీ వర్షంతో తడిచి ముద్దయ్యాయి.