TDP : టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం పైన వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ(TDP ) నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపడుతున్నారు.
మంత్రుల, ఎమ్మెల్యేల ఇంటిముందు దర్నాకి దిగుతున్నారు. వైసీపీ నేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు.ఇందులో భాగంగానే వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇంటిని టీడీపీ నేతలు ముట్టడించారు. దీనితో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎపీలో ఎక్కడ చూసిన ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తున్నాయి.
అటు సోషల్ మీడియాలో అంబటి రాంబాబు పైన డైరెక్ట్ గా ఎటాక్‌కి దిగారు టీడీపీ కార్యకర్తలు.అంబటి రాంబాబు కన్నుమూత, శ్రద్దాంజలి అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. అంబటితో పాటుగా వల్లభనేని వంశీ, మంత్రి కొడాలి నాని కూడా కన్నుమూత, శ్రద్దాంజలి ఘటించండి అంటూ పోస్ట్‌లు కనిపిస్తున్నాయి.
Also Read :
- Jagga Reddy : జగన్ .. బాబు తిరిగి గెలిస్తే నీ పరిస్థితి ఏంటి? ఏపీ రాజకీయాల పై జగ్గారెడ్డి..!
- నా జాబ్ పోయిన ఫర్వాలేదు.. వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది : ఏపీ కానిస్టేబుల్