sunflower oil : సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ. 200.. దొరుకుడు కష్టమేనట..!
Andhra Pradesh Latest News Telangana

sunflower oil : సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ. 200.. దొరుకుడు కష్టమేనట..!

sunflower oil :  ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం నిరవధికంగా కొనసాగుతుండటంతో చమరు ధరలతో పాటుగా వంట నూనె ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రధాని మోదీ స్వయంగా నిన్న వెల్లడించిన సంగతి తెలిసిందే.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి భారతదేశానికి దిగుమతి కావాల్సిన సరుకులు పూర్తిగా ఆగిపోయాయి.ముఖ్యంగా మనదేశంలో ఎక్కువగా వాడే సన్‌ఫ్లవర్ ఆయిల్(sunflower oil) కొరత చాలా ఏర్పడుతోంది.

భవిష్యత్తులో వంటనూనె కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ లోని కొన్ని రీటైల్, మాల్స్, కిరాణా దుకాణాల్లో ఎక్కువగా సన్‌ఫ్లవర్ ఆయిల్ స్టాక్ కనిపించడం లేదు. ఇంకా కొన్ని షాపుల్లో అయితే కుటుంబానికి మూడు కంటే ఎక్కువ అమ్మడం లేదు.

ఇక అయిదు లీటర్ల క్యాన్ అయితే అస్సలు కనిపించడం లేదు.. ఇలాగే ఉంటే ఆయిల్ ప్యాకెట్ ధర రూ. 200 వరకు పెరగొచ్చునని అంటున్నారు. ఇక అటు యుద్ధం పేరు చెప్పుకోని కొందరు వ్యాపారాలు అయితే పెద్ద దందానే మొదలుపెట్టారు. విశాఖ జిల్లాలోని గాజువాకలో కొందరు వ్యాపారులు ఆయిల్ ప్యాకెట్ లపై ఉన్న ఎంఆర్‌పీ ధరలను మార్చేసి రెట్లు పెంచేసి జనాలకి టోపీలు పెడుతున్నారు.

దాదాపుగా 60 టన్నుల వంటనూనెకి కొత్త రెట్లు ఫిక్స్ చేశారు. ఇది అధికారుల దృష్టికి వెళ్ళడంతో వ్యాపారుల పై కొరడా ఝలిపించారు. ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 23న రూ.141గా ఉన్న సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర ఇప్పుడు హోల్‌సేల్ మార్కెట్‌లో రూ.186, రిటైల్ మార్కెట్‌లో రూ.195గా ఉంది. గత 15 రోజులలో సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా రూ.50 పెరిగాయి.

అయితే పామోలిన్‌ ఆయిల్‌, కొబ్బరినూనె, ఆలివ్‌ ఆయిల్‌ తదితర వంటనూనెల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

Also Read :