నా జాబ్ పోయిన ఫర్వాలేదు.. వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది : ఏపీ కానిస్టేబుల్
Andhra Pradesh Latest News

నా జాబ్ పోయిన ఫర్వాలేదు.. వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది : ఏపీ కానిస్టేబుల్

టీడీపీ అధినేత చంద్రబాబు పై ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ నేతలు వ్యవహరించిన తీరును ప్రతిఒక్కరూ తప్పుపడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించాల్సిన తీరు ఇది కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిన్న జరిగిన సంఘటనను బ్లాక్ డే గా టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

నిండు సభలో చంద్రబాబుకి జరిగిన అవమానం పట్ల ప్రకాశం జిల్లాకు చెందిన కానిస్టేబుల్ విజయకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. వైసీపీ సర్కార్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని తెలిపాడు. నేతలు నైతిక విలువలు మరిచి ప్రవర్తిస్తున్నారని అన్నాడు. మంత్రుల ప్రవర్తన చూస్తుంటే సమాజమే తలదించుకునేలా ఉందని అభిప్రాయపడ్డాడు.

రాష్ట్రంలో పోలీసుల వ్యవస్థ చాలా దారుణంగా ఉందని, తన ఉద్యోగం పోయిన ఫర్వాలేదని అన్నాడు. తనకి బాబు హయంలోనే జాబ్ వొచ్చిందని టీడీపీ, వైసీపీ పాలన చాలా తేడా ఉందని అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Also Read :

New Farm laws : చట్టాల రద్దు వెనుక మోదీ మాస్టర్ ప్లాన్ ఏంటి?

Farm laws : రద్దు సరే.. 750 కుటుంబాల సంగతేంది మోడీ గారూ..?

SHABEENA SHAIK : జబర్దస్త్ లో ఈ ఎర్రతోలు పిల్ల ఎవరు?