Jagga Reddy  : జగన్ .. బాబు తిరిగి గెలిస్తే నీ పరిస్థితి ఏంటి? ఏపీ రాజకీయాల పై జగ్గారెడ్డి..!
Andhra Pradesh Latest News

Jagga Reddy  : జగన్ .. బాబు తిరిగి గెలిస్తే నీ పరిస్థితి ఏంటి? ఏపీ రాజకీయాల పై జగ్గారెడ్డి..!

Jagga Reddy  : ఇప్పుడు ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్‌‌‌గా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యామిలీ పై కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడం, దానికి బాధపడిన బాబు అసెంబ్లీ నుంచి బయటకు రావడం.. ఆ తర్వాత ప్రెస్ మీట్‌‌లో ఏడవడం జరగాయి. సీనియర్ అధినేత, అందులోనూ ప్రతిపక్ష నేత పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల పలువురు రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు.అందులో భాగంగానే సంగారెడ్డి ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగారెడ్డి(Jagga Reddy ) స్పందించారు.

చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం చాలా మంది నాయకులకు ఇబ్బందిగానే అనిపిచిందని అన్నారు. బాబు సీఏంగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తిగత దూషణాలు చూడలేదని అన్నారు. జగన్‌కు సీఎం పదవి శాశ్వతం కాదని.. రాజకీయాల్లో చాలా హుందాగా ఉండాలని సూచించారు.

ఇలాంటి సంప్రదాయాలకు జగన్ ఫుల్‌స్టాప్ పెట్టాలని సూచించారు. ఇలాగే చేస్తే ఏదో ఒకరోజు జగన్‌‌కే రివర్స్ అవుతుందని హెచ్చరించారు. వైఎస్ హయంలో చంద్రబాబు పై ఓ సారి వైఎస్ మాట జారినప్పుడు దానిని వెనక్కి తీసుకున్నారని అన్నారు.

ఇక వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల పైన జగ్గారెడ్డి స్పందించారు. స్పీకర్ తమ్మినేని ఆ పదవి అనర్హుడని అనేశారు జగ్గారెడ్డి.. మంత్రులు కొడాలి నాని, అనిల్ మాట్లాడే బాష పద్ధతిగా లేదని అన్నారు. కుస్తీకి దిగినట్టే ఉందని అన్నారు.

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు కొడాలి నాని ఎక్కడ ఉన్నాడంటూ ప్రశ్నించారు జగ్గారెడ్డి. వైసీపీ నేతల ప్రవర్తన సమాజానికి చెడు సంకేతాలు పంపిస్తోందని అన్నారు. ఆనాడు కౌరవ సభలో ద్రౌపదికి జరిగిన అన్యాయమే బాబుకు జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read :