Minister Roja sensational comments : అభిమానులకు నటి, ఎమ్మెల్యే, తాజాగా మంత్రి అయిన రోజున షాకిచ్చారు. నటిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రోజా చాలా పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. తన నటనతో మెప్పించారు.
సినిమాల తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయినా స్క్రీన్ పై ఆమె కనిపిస్తూనే ఉన్నారు. అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నారు. అంతకుమించి టీవీ షోల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు.
Read Also :
- Kodali Nani : కొడాలి నానికి సీఏం జగన్ కీలక పదవి
- Mehreen Pirzada : మ్యారెజ్ బ్రేకప్ తర్వాత చాలా మారిన మెహ్రీన్..!
- Kajal aggarwal : మదర్ హుడ్ లోనూ మెస్మరైజింగ్ కాజల్
జబర్దస్త్ షో సక్సెస్ కు రోజా(Minister Roja) కూడా ఓ కారణం. జబర్దస్త్ తో పాటు.. ఈటీవీలో వచ్చే చాలా షోలలో రోజా కనిపిస్తూనే ఉన్నారు. ప్రజలను ఆకట్టుకుంటున్నారు.
అయితే.. ఎమ్మెల్యేగా ఉన్న రోజాకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవి ఇచ్చారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చాలా బిజీగా ఉండేవారు అయినా షోలకు మాత్రం దూరం అవ్వలేదు.
కానీ ఇప్పుడు మంత్రి అయ్యారు కాబట్టి మరింత బిజీ అయిపోతారు. అందుకే ఇకపై రోజా(Minister Roja) స్క్రీన్ పై కనిపిస్తుందా లేదా అనే దానిపై అభిమానుల్లో ఆందోళన కనిపిస్తోంది.
అయితే అంతా భావించినట్టే.. తాను ఇకపై టీవీ షోలు చేయబోనని ప్రకటించారు రోజా. సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని ప్రజలకు సేవ చేసేందుకు వాడతానని చెబుతున్నారు.
ఇకపై జబర్దస్త్ లో ఆ నవ్వులు.. ఆ పంచ్ లు.. మనం మిస్సైనట్టే.
ఇక.. తనకు మంత్రి పదవి రావడంపై చాలా సంతోషం వ్యక్తంచేసిన రోజా.. రెక్కలు కట్టుకుని గాల్లో ఎగిరినట్టు ఉందని చెప్పారు. మొదటి నుంచి జగన్ తనకు అండగా ఉన్నారని.. తనపై నమ్మకంతోనే పదవి ఇచ్చారని చెప్పారు. జగన్ కోసం, పార్టీ కోసం తన ప్రాణమైనా పెట్టి పోరాడతానన్నారు. జగన్ మరో 20 నుంచి 30 ఏళ్లు సీఎం అయ్యేలా కృషి చేస్తానంటున్నారు.
Read Also :
- Ram Gopal Varma : మందులో ఉన్న వర్మని ముద్దులతో ముంచెత్తిన హీరోయిన్..!
- Balayya : పుట్టినరోజు నాడే చనిపోయిండు.. ‘బాలయ్య’ ఇక లేరు..!
- Grama volunteer : కిరాక్ గాడు.. పంచాల్సిన పింఛన్ డబ్బులు తీసుకొని లవర్తో పరార్.. ఇక్కడో ఇంకో ట్విస్ట్..!