Grama volunteer : రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి చేర్చేందుకు సీఏం జగన్ వాలంటీర్ల(Grama volunteer) వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు.. ఇందులో పింఛన్ డబ్బులు పంచడం ఒకటి.. ప్రతి నెల వచ్చే పింఛన్ డబ్బులను అర్హులైన లబ్దిదారులకి ఇవ్వడం వారి బాధ్యత.. అయితే కొందరు వాలంటీర్లు ఇందులో చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
తాజాగా గుంటూరు జిల్లాలో ఓ వాలంటీర్ పంచాల్సిన పింఛన్ డబ్బులతో లవర్‌తో కలిసి పరారయ్యాడు.. ఈ ఘటన బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెంలోచోటు చేసుకుంది. రావాల్సిన పింఛన్ డబ్బులు టైంకి రాకపోవడం లబ్ధిదారులు గ్రామ అధికారులను నిలదీశారు. వారు సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడంతో సదరు వాలంటీర్ తన లవర్‌తో పింఛన్ డబ్బులతో జంప్ అయ్యాడని తెలిసింది.
చివరికి వాలంటీర్ తండ్రి ఆ డబ్బును తిరిగి సచివాలయ సిబ్బందికి అందజేశారు. దీంతో సిబ్బంది ఆ డబ్బును పెన్షన్ల కింద పంపిణీ చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీడీవో వాలంటీర్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఐతే ఇక్కడో ఇంకో ట్విస్ట్ ఉంది. ఆ వాలంటీర్‌కి ఆల్రెడీ పెళ్లై, పిల్లలున్నారు.
Also Read :
- Yati Narsinghanand : అలా అయితే 50% హిందువులు ముస్లిం మతంలోకి వెళ్తారు..!
- Radisson Blu Hotel : ఆ పబ్ అండ్ రెస్టారెంట్‌కి షాకిచ్చిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ…!
- Rahul Gandhi : రాహుల్ గాంధీ గొప్పోడట.. ఆస్తి మొత్తం రాసిచ్చింది..!