RGV : జగన్ మంత్రుల ఇజ్జత్ తీసిన వర్మ..!
Andhra Pradesh Latest News

RGV : జగన్ మంత్రుల ఇజ్జత్ తీసిన వర్మ..!

RGV :  ఏపీలో సినిమా టికెట్ల వ్యవహరం పైన పెద్ద రచ్చే నడుస్తోంది.. రోజురోజుకూ ఇష్యూ పెద్దదై కూర్చుంటుంది. జగన్ సర్కార్ పై సినీ సెలబ్రేటీలు మెల్లిమెల్లిగా ఫైర్ అవుతుర్రు.. తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV ) జగన్ అండ్ టీం పైన తనదైన శైలిలో కౌంటర్లు వేశాడు.

మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాద‌వ్‌ల‌కు సినిమా గురించి అసలేమీ తెలీద‌ని ఒకమాటలో తీసిపారేశాడు. టికెట్ రేట్లు త‌గ్గించ‌డం ఇల్లాజిక‌ల్‌ అంటూ చెప్పుకొచ్చాడు వర్మ.. హీరో రెమ్యున‌రేష‌న్ అనేది సినిమా బ‌డ్జెట్‌లో భాగ‌మేన‌ని వర్మ అన్నారు.

హీరోను బ‌ట్టే సినిమా ఆడుతుంద‌ని.. సినిమా బ‌డ్జెట్‌ను, హీరో రెమ్యున‌రేష‌న్‌ను వేరుగా చూడ‌లేమ‌ని.. మంత్రి అనిల్‌కు అవ‌గాహ‌న లేద‌ని వ‌ర్మ తేల్చేశారు. ఇక ప్రొడ‌క్ట్ త‌యారు చేసినవాడే.. దాని వాల్యూని, ఎమ్ఆర్పీని నిర్ణయించ‌డం న్యాయమేనని వర్మ చెప్పుకొచ్చారు.

మ‌ధ్యలో గ‌వ‌ర్నమెంట్‌కు ఏం అవ‌స‌రమని వర్మ ప్రశ్నించారు. మాములు సినిమాకి వందకోట్ల సినిమాకి ఒకే బ‌డ్జెట్‌ ఉండ‌టం దారుణమని అన్నారు వర్మ.. ప్రభుత్వ నిర్ణయం ఎవ‌రికీ లాభం చేకూర్చద‌ని.. ఇది సినిమా ప‌రిశ్రమ‌ను నాశ‌నం చేసే శాపమ‌ని వర్మ ఏకిపారేశారు.

Also Read :