CM YS Jagan Transferred money to farmers : కొద్ది రోజుల క్రితం గులాబ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఏపీలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. వేలాది మంది రైతులు పంట నష్టపోయారు. గులాబ్ తుఫాను కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు రూ.22 కోట్ల పంట నష్ట పరిహారాన్ని అందజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమచేశారు.
ఇవి కూడా చదవండి :
- Bandi Sanjay : ప్లీజ్.. నవ్వొద్దు. సీరియస్ పోస్ట్ ఇది..!
- Paddy farmer : ఆగం చేస్తున్నది నువ్వు కాదా సారూ..?
రాష్ట్రంలో చాలామంది రైతులు వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారన్నారు జగన్. అలాంటి రైతు ఆర్థికంగా చితికిపోయి రోడ్డు మీద పడే పరిస్థితులు వచ్చాయన్నారు. రైతులు ఆర్థికంగా చితికిపోతే.. రాష్ట్ర ఆర్థికవ్యవస్థ కూడా చితికిపోయినట్టేనని.. అందుకే రైతులను ఆదుకుంటున్నామని చెప్పారు. భవిష్యత్ లో ఏమైనా ఇబ్బందులు వచ్చినా రైతులకు అండగా ఉంటామని చెప్పారు.
ఏ సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్లో పరిహారాన్ని చెల్లించే ఒక కొత్త సాంప్రదాయాన్ని రాష్ట్రంలో తీసుకువచ్చామన్నారు జగన్. ప్రకృతి విపత్తులు వల్ల ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా పారదర్శకంగా సోషల్ఆడిట్ కోసం గ్రామంలోనే జాబితా ప్రదర్శిస్తున్నామని చెప్పారు. నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందిస్తున్నామని తెలిపారు.
Read Also :
- RTC CHARGES : ప్రయాణికులకు షాక్.. చార్జీలు భారీగా పెంపు..!
- Telangana : తెలంగాణ పాపులర్ సీఎం క్యాండిడేట్ రేవంతేనా…?
- Vijayashanthi : ఈ ధర్నా దేనికి.. KCRకి రాములమ్మ సూటిగా 18 ప్రశ్నలు..!
- AP Municipal : కుప్పం వైసీపీ చైర్మన్ అభ్యర్థి రాసలీలలు … ‘అబ్బా వద్దురా ప్లీజ్’..!
- Telangana : తెలంగాణలో మళ్ళీ ఉపఎన్నికలు.. ఆ రెండు స్థానాలకు.. !
- Harish Rao: హరీష్‌ని బయటకు పంపుడేనా..లేకా సంప్రదాయం మారుస్తారా.. కేసీఆర్ ప్లాన్ ఏంటి?
- పియానో వాయిస్తూ 12 మంది మహిళలను బుట్టలో.. నల్గొండలో నికృష్ణుడు
- KCR Press Meet : మెడలు వంచుతా అన్నోనికి మెడ మీద తలకాయ లేదని అర్ధమైంది..!