YS jagan vs Raghurama : : నేడే తీర్పు.. వైసీపీ నేతల్లో టెన్షన్‌..!
Andhra Pradesh Latest News

YS jagan vs Raghurama : : నేడే తీర్పు.. వైసీపీ నేతల్లో టెన్షన్‌..!

YS jagan vs Raghurama : ఏపీ సీఎం జగన్‌ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఈ రోజు తీర్పు చెప్పనుంది. గత నెల లాస్ట్ లో వాదనలు ముగియగా తీర్పును ఇవాళ వెల్లడించనుంది.

దీనిపైన సీబీఐ కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించనుందోనని వైసీపీ నేతలతో పాటుగా ఏపీ ప్రజల్లో కూడా ఉత్కంఠ నెలకొంది.జగన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 11 చార్జ్ షీట్లను సీబీఐ నమోదు చేసిందని ఎంపీ రఘురామ పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే సీఎం హోదాలో వైఎస్ జగన్‌ వివిధ కారణాలు చెబుతూ కోర్టుకు హాజరు కావడం లేదని సీబీఐ కోర్టుకు వివరించారు. జగన్ కేసుల పైన త్వరగా విచారణ జరపాలని పిటీషన్‌లో పేర్కొన్నారు రఘురామ.

జగన్ నిర్దోషిలా బయటపడాలన్నదే తన ఉద్దేశమన్నారు. అయితే రఘురామ వ్యక్తిగత కక్షతోనే పిటిషన్ వేశారని జగన్ కౌంటర్ దాఖలు చేశారు. దీనిని ఈ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ వేయడానికి నిరాకరించింది.

Also Read :