అయ్యా జగన్.. వినాయకచవితి వేడుకల పై ఎందుకీ వివక్ష?
Andhra Pradesh Latest News

అయ్యా జగన్.. వినాయకచవితి వేడుకల పై ఎందుకీ వివక్ష?

ఏపీలో వినాయకచవితి వేడుకల పైన ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని అధికారులను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. అటు నిమజ్జన ఊరేగింపులు కూడా చేయకూడదని తెలిపింది. ఈ క్రమంలో హిందూ సంఘాలు, బీజేపీ నేతలు సర్కార్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

కోవిడ్ పేరు చెప్పి వినాయకచవితి వేడుకల పై ఆంక్షలు విధించిన ప్రభుత్వం, ఇతర వర్గాల పండుగలకి ఎలా అనుమతి ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన మొహర్రం, గుడ్ ఫ్రైడే వేడుకలకి వందలాది మంది ఒకే చోట గుమ్మిగుడితే తప్పులేదు కానీ వినాయక చవితి వేడుకలకి మాత్రం ఇబ్బందులు కనిపించాయా అని ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే సెప్టెంబర్ 2న దిగంవత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు ఊరువాడా సభలు, సమావేశాలు నిర్వహించారు. అప్పుడు లేని కరోనా నిబంధనలు వినాయక చవితి అప్పుడే గుర్తుకువచ్చాయా అన్నది హిందూ సంఘాల ప్రశ్న. అంతేకాకుండా కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తుందని నిపుణులు హెచ్చరిస్తుంటే ఏపీలో స్కూళ్లను కూడా ఓపెన్ చేశారు.

విద్యార్ధులకి కరోనా వస్తుందని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం మాత్రం స్కూల్స్ ఓపెన్ చేసింది. ఇప్పుడు చాలా మంది విద్యార్ధులు కరోనా బారిన పడ్డారు. అయినప్పటికీ సర్కార్ మాత్రం స్కూల్స్ ని అలాగే కంటిన్యూ చేస్తుంది. అప్పుడు గుర్తుకురాని కరోనా వినాయక చవితి వేడుకలప్పుడే వచ్చిందా అని హిందూ సంఘాలు ప్రభుత్వం పైన ఫైర్ అవుతున్నాయి.

వినాయక చవితి వేడుకలపై విధించిన ఆంక్షలను వెంటనే రద్దు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. వినాయక చవితి అంటే కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే అరుదైన పండుగ. హిందువులతో పాటుగా ముస్లింలు కూడా ఈ పండుగును జరుపుకుంటారు. అలాంటి పండగ పైన పూర్తి నిషేధం ఏంటని నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు.

Also Read :