MLA Roja : సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమేనా అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. వైసీపీ పైన జనాల్లో ఇప్పుడిప్పుడే మొదలైన వ్యతిరేకత, నగరి నియోజకవర్గంలో రోజా(MLA Roja) పైన ఎప్పుడో ఏర్పడిన వ్యతిరేకత ఆమె శాపంగా మారనున్నాయని తెలుస్తోంది.
ఇప్పుడు దీనికి తోడు ఆమె పైన ఇద్దరు సినీ యాక్టర్లు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారట.. వచ్చే ఎన్నికల్లో రోజాని డైరెక్ట్ గా ఢీ కొట్టేందుకు సినీనటి దివ్యవాణి టీడీపీ అభ్యర్థిగా నగరి నుంచి బరిలో దిగేందుకు రంగం రెడీ అయిందంటున్నారు. ఇక ఇప్పటికే ఇక్కడి నుంచి పోటీ చేస్తానని మరో సినీ నటి వాణీ విశ్వనాథ్ ప్రకటించారు.
అయితే ఆమెకి జనసేన టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రజెంట్ అయితే వాణీ విశ్వనాథ్ కూడా టీడీపీ లోనే ఉన్నారు. ఆమె త్వరలో జనసేన తీర్ధం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. రెండుసార్లు వైసీపీ పార్టీ నుంచి నగరి ఎమ్మెల్యేగా గెలిచారు రోజా..
నియోజక అభివృద్ధి కంటే జబర్దస్త్ లాంటి షోలకి ఆమె ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. సహజంగా నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎన్నికైన రోజాకు వ్యతిరేకత కూడా పెరిగిందట. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున రోజా పోటీ చేసినప్పటికీ గెలవడం చాలా కష్టమని తెలుస్తోంది.
జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. రోజాకి డిపాజిట్లు కూడా కష్టమేనని అంటున్నారు రాజకీయ నిపుణులు.
Also Read :