YS jagan : ముందస్తుకు జగన్ .. బాబుకి బ్యాడ్ టైమ్..!
Andhra Pradesh Latest News

YS jagan : ముందస్తుకు జగన్ .. బాబుకి బ్యాడ్ టైమ్..!

Ys Jagan : తమ పాలన పైన నమ్మకం ఉన్న ముఖ్యమంత్రులు ప్రజాతీర్పు కోరుతూ ముందస్తు ఎన్నికలకి వెళ్లడం అనేది సర్వసాధారణం.. 2018లో తెలంగాణలో కేసీఆర్ అలాగే ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్ళీ అధికారాన్ని చేపట్టారు. ఇప్పుడు కేసీఆర్ రూట్ లొనే ఏపీ సీఎం జగన్ కూడా వెళ్లనున్నారు.

ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ కూడా ఇదే.. మరో ఏడాది పాలనను రద్దు చేసి జగన్ ముందస్తు ఎన్నికలకి వెళ్లనున్నారని నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలే మళ్లీ తమని అధికారంలో నిలబెడతాయని జగన్ ఫుల్ ధీమాగా ఉన్నారట.

జగన్ ముందస్తుకి వెళ్తే లాభాలే ఎక్కువగా ఉన్నాయి.. ప్రజల ఆమోదంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, ప్రతిపక్షాల మాటలకి చెక్ పెట్టొచ్చు. ప్రస్తుతం ఏపీ అప్పుల్లో కూరుకుపోయింది. ఆర్ధికంగా రాష్ట్రం కూడా దిగజారిపోయింది. దీనితో వైసీపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలయింది.

ఇలాగే ఐదేళ్ల వరకు పాలన కొనసాగించి ఎన్నికలకు వెళ్తే మాత్రం ఫైట్ తప్పదని రాజకీయ విశ్లేషకుల భావన..ముందస్తు ఎన్నికల కోసమే.. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ సీఎం జగన్ సంక్షేమ పథకాలు ఆపడం లేదన్న చర్చ నడుస్తుంది. ఇప్పటికే హామీ ఇచ్చిన పథకాల్లో దాదాపు 80శాతం అమల్లోకి వచ్చాయి. ఈ కాన్ఫిడెంట్ తో జగన్ ముందస్తు ఎన్నికలకి వెళ్లి ఈజీగా గెలవొచ్చు.

ఒకేసారి ఇటు అసెంబ్లీకి, అటు పార్లమెంట్ కు ఎన్నికలు జరిగితే పొత్తులు తెరపైకొస్తాయి. బీజేపీతో పొత్తు ఉండొచ్చు అన్న చర్చ నడుస్తోంది. ముందస్తుకి వెళ్తే.. సింగిల్ గానే మళ్లీ బరిలోకి దిగొచ్చు. ఎంపీ ఎలక్షన్ల వరకు పొత్తులు ఆలోచించవచ్చు. ఇలా ముందస్తుకు వెళ్లడం వల్ల అనివార్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ఇబ్బంది జగన్ కు తప్పుతుంది.

జగన్ ముందస్తుకి వెళ్తే మాత్రం బాబుకి మళ్లీ ప్రతిపక్షం తప్పదనేది విశ్లేషకుల మాట.  ఇప్పటికే పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. 23మందిలో నలుగురు చేజారారు, బుచ్చయ్య ఆటో ఇటో ఉన్నారు. పెరిగిన ఓ నాలుగు ఐదో పెరగొచ్చు కానీ అధికారంలోకి వచ్చే సీన్ అయితే కనిపించడం లేదు.