Chandrababu Naidu : చంద్రబాబుకి అవమానం జరిగిందని మహిళా ఉద్యోగి రాజీనామా
Andhra Pradesh Latest News

Chandrababu Naidu : చంద్రబాబుకి అవమానం జరిగిందని మహిళా ఉద్యోగి రాజీనామా

Chandrababu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబు పై ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు పట్ల ఇప్పుడు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నిండుసభలో చంద్రబాబుకి (Chandrababu Naidu) జరిగిన అవమానాన్ని తట్టుకోలేక కొందరు ఉద్యోగులు రాజీనామా చేస్తున్నారు.

ఇప్పటికే ప్రకాశం జిల్లాకి చెందిన కానిస్టేబుల్ విజయకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. వైసీపీ సర్కార్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని తెలిపాడు. ఇక తాజాగా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లుగా ఓ మహిళ ఉద్యోగి నిర్ణయం తీసుకొంది.

కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం వై.కోట గ్రామానికి చెందిన దుద్యాల అనితాదీప్తి 2014 అక్టోబరులో మెప్మాలో టౌన్‌ మిషన్‌ కో-ఆర్డినేటరుగా పనిచేస్తోంది.

ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి తన రాజీనామా లేఖను ఉన్నతాధికారులకు అందజేసింది. టీడీపీ సీనియర్‌ నేత, శాప్‌ మాజీ డైరెక్టర్‌ దుద్యాల జయచంద్ర కుమార్తెనే ఈ అనితాదీప్తి.