Cheating Love : వారిద్దరిది యుక్త వయసు.. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.. చట్టపట్టాలేసుకొని తిరగారు.. ఆమె ప్రేమ అనుకుంటే.. మనోడు అవసరం(Cheating Love ) అనుకున్నాడు.. ఈ క్రమంలో యువతిని గర్భవతిని చేశాడు.. తీరా పెళ్లి ముచ్చట వచ్చేసరికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం లేదంటూ హీరో స్టైల్లో నాలుగు సినిమా డైలాగులు చెప్పాడు. కానీ ఆమె హీరోయిన్ లాగా కరిగిపోలేదు.. లేడీ విజయశాంతిలా ఎదురు తిరిగింది.
పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ నలుగురి ముందు పంచాయితీ పెట్టింది.తప్పని పరిస్థితిల్లో నలుగురి సమక్షంలో ఆ అమ్మాయి మేడలో మూడు ముళ్ళు వేశాడు. ఆ తర్వాత ఇంట్లో అబ్బాయి వాళ్ల అమ్మ-నాన్న ఒప్పుకోకపోవడంతో వేరే చోట కాపురం పెట్టారు.. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
జూన్ 30న తన ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు.. కానీ మళ్ళీ తిరిగిరాలేదు.. దీనితో ఆ యువతి.. న్యాయం కావాలి భర్త కావాలి అంటూ యువకుడు ఇంటి వద్ద మౌనపోరటానికి దిగింది. ఈ సంఘటన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో చోటు చేసుకుంది.
బాధితురాలు పేరు నర్రు వందన, ఆమె భర్త పేరు నర్రు చినబాబు.. నర్రు చినబాబు కనిపించకపోవడంతో మిస్సింగ్ ఫైల్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read :
- Nagababu : ఓరక్క.. ఇండియా ఓడిపోవడానికి ‘నాగబాబు’ కారణమా.. ఇందేదయ్యా ఇది..!
- Ritu Varma : ఏం సక్కగున్నావే లవంగి టెక్కుదానా..!
- Rajababu : ఇండస్ట్రీలో మరో విషాదం…’రాజబాబు’ ఇక లేరు..!
- Samantha Ruth Prabhu : మూడు యూట్యూబ్ చానళ్లపై సమంత పరువు నష్టం దావా..!