8 District Leaders : ఆ 8 జిల్లాలు ఏం పాపం చేశాయ్ జగనన్న..?
Andhra Pradesh Latest

8 District Leaders : ఆ 8 జిల్లాలు ఏం పాపం చేశాయ్ జగనన్న..?

8 District Leaders didn’t got chance in AP Cabinet : కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా మొత్తం 25 మందితో కొత్త క్యాబినెట్ ని ప్రకటించారు సీఎం జగన్. ముందునుంచి చెప్పినట్టు ఒక్కరో ఇద్దరినో తిరిగి క్యాబినెట్ లోకి తీసుకుంటారన్న చర్చ నడిచినప్పటికీ మొత్తం 11మందికి క్యాబినెట్ లో చోటు కల్పించారు.

ఇవి కూడా చదవండి :

నాలుగు జిల్లాల నుంచి ఏకంగా ముగ్గురేసి మంత్రులను తీసుకున్న జగన్..  ఆ ఎనిమిది జిల్లాల నుంచి ఒక్కరికి కూడా కొత్త మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వలేదు. అల్లూరి సీతారామరాజు, విశాఖ, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల నుంచి ఎవరికీ అవకాశం ఇవ్వలేదు.

సత్యసాయి జిల్లాలో ఒక్కరికైనా అవకాశం ఇస్తారని అంతా భావించారు. ఈ జిల్లాలో ఉన్న ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హిందూపురం తప్ప మిగతా ఐదుచోట్ల వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ముఖ్యంగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి, కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంటకు మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం సాగింది. కాని, కొత్త మంత్రివర్గంలో సత్యసాయి జిల్లా తరపున ఒక్కరికి కూడా చోటు దక్కలేదు.

8 జిల్లాల్లో ఏ ఒక్కరికీ అవకాశం ఇవ్వని జగన్.. ఉమ్మడి జిల్లాల పరిధిలో మాత్రం ముగ్గురేసి చొప్పున అవకాశం ఇచ్చారు. చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, రోజాకు అవకాశం ఇచ్చారు.

తూర్పు గోదావరి జిల్లా నుంచి పినిపె విశ్వరూప్‌, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ఛాన్స్ దక్కింది. గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబు, విడదల రజని, మేరుగ నాగార్జున, పశ్చిమ గోదావరి నుంచి తానేటి వనిత, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావుకు అవకాశం ఇచ్చారు.

ఇవి కూడా చదవండి :