వీ6 తీన్మార్ వార్తల్లో కొత్త యాంకర్.. ఎవరో తెలుసా..?

వీ6 తీన్మార్ వార్తల్లో కొత్త యాంకర్ కనిపించింది. ఆ ప్రోగ్రామ్ ట్రేడ్ మార్క్ యాంకర్ అయిన సావిత్రి(జ్యోతి)  బిగ్ బాస్ కారణంగా కార్యక్రమం నుంచి ఇటీవల తప్పుకుంది. ఐతే.. తీన్మార్ వార్తల్లో ఎంతో  ప్రాధాన్యమున్న యాంకర్ పోస్టులోకి వీ6 ఛానెల్ కొత్త యాంకర్ ను తీసుకుంది. సోమవారం రోజున రాత్రి. 9.30 గంటలకు ప్రసారమైన తీన్మార్ వార్తల్లో ఆమె తెరపై కనిపించింది. నమస్తే… కొత్తగా నేను ఎవరనుకుంటున్నారా..  నేను రాధని అని పరిచయం చేసుకుంది.

రాములమ్మ.. మంగ్లీ.. లచ్చమ్మ.. సుజాత.. సావిత్రి..  పద్మ… వార్తలు చెప్పే యాంకర్ కే కొత్త అర్థం చెబుతూ… వీ6 ఛానెల్ పరిచయం చేసిన క్యారెక్టర్లు ఇవి. న్యూస్ ప్రెజెంటర్లు అంటే ఇలాగే ఉండాలంటూ గిరిగీసి టీవీ మీడియా రాసుకున్న నిబంధనలను వీ6 ఏనాడో బ్రేక్ చేసింది. కొత్త స్టైల్ ను పరిచయం చేసింది. ఆ తర్వాత పాపులర్ కూడా చేసింది. అలా… రాధ పేరుతో తీన్మార్ కొత్త యాంకర్ ను పరిచయం చేశారు.

రాధ బ్యాక్ గ్రౌండ్ ఏంటి…?

స్క్రీన్ నేమ్ రాధతో ఇపుడు ఎక్కువమందికి పరిచయం ఐనప్పటికీ.. ఆమె ఇప్పటికే టీవీ మీడియా సర్కిల్స్ లో కొంత పేరున్న యాక్టర్. ఆమె అసలు పేరు ప్రియా భరద్వాజ్. పక్కా హైదరాబాదీ. చదివింది అంతా హైదరాబాద్ లోనే. జెమినీ, స్టార్ మా ఛానెల్స్ లో వీజేగా కొన్ని ప్రోగ్రామ్స్ చేసింది. లైవ్ షోస్, సక్సెస్ మీట్స్, ఈవెంట్స్ లలో కనిపించింది. మూడేళ్ల కిందటే… ఈటీవీ ప్లస్ వారి సినిమా చూపిస్త మామ ప్రోగ్రామ్ లో ఓసారి పార్టిసిపేట్ చేసింది. షార్ట్ ఫిలింస్, టీవీ సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం ఈటీవీ ‘ఆడదే ఆధారం’ సీరియల్ లో ప్రియంవద అనే క్యారెక్టర్ లో నటిస్తోంది. ఇపుడు లేటెస్ట్ గా రాధగా వీ6 ప్రేక్షకులను పలకరించింది.

తీన్మార్ యాంకరింగ్ అంటే అంత ఈజీ కాదు. తెలంగాణ యాసలో వార్తను.. స్క్రిప్ట్ అని తెలియకుండా గడగడా ముచ్చట చెప్పినట్టు చెప్పగలగాలి. ఈ విషయంలో రాధ ఫస్ట్ ఎపిసోడ్ లో ఓకే అనిపించింది. కానీ.. మరింత ట్రైనింగ్ అవసరం. ఐతే… రాధ స్క్రీన్ ప్రెజెన్స్ .. వాయిస్.. ఎక్స్ ప్రెషన్స్.. బాగున్నాయంటున్నారు తీన్మార్ ఫ్యాన్స్.

తొలి ఎపిసోడ్ లోనే సత్తితో కాన్వర్జేషన్ ఆకట్టుకునేలా తీశారు. గారు అనాలా.. అన్న అనాలా.. తమ్ముడు అనాలా.. అనేది తెలియక తికమక పడుతున్నట్టుగా చూపించడం బాగుంది. సావిత్రి –సత్తి.. అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ సూపర్ గా వర్కవుట్ అయింది. మరి రాధ-సత్తి ఇద్దరి జోడీ ఎలా ఉంటుందో చూడాలి.